హాట్ అండ్ సెక్సీ లేడీతో హీరో డింకచిక..డింకచిక...!
'దబాంగ్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న తమిళ చిత్రం 'ఓస్తి". శింబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మిరపకాయ్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ ఐటం సాంగ్ కోసం, శింబు గత కొద్ది కాలంగా నయనతార వెంటపడిన ఫలితం లేకపోయింది. దాంతో టాలీవుడ్ కోలీవుడ్ ను పక్కన పెట్టి నేరుగా బాలీవుడ్ కే టెండర్ పెట్టాడు శింబు..
ఈ సాంగ్ లో నటించేందుకు బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ ను కోరడం, దానికి కత్రినా కూడా ఓప్పుకున్నట్టు సమాచారం. ఈ సాంగ్ లో నటించేందుకు కత్రినా కోటీ రూపాయలు రెమ్యునరేషన్ కోరిందట. ఈ సాంగ్ షూటింగ్ కేవలం 5 రోజుల్లోనే పూర్తి అవుతుందని చెప్పినా కూడా కత్రినా కోటీ నుండి కొంచెం కూడా తగ్గలేదని సమాచారం. అయినా కూడా కత్రినానే ఎంపిక చేసుకున్నారని తాజా సమాచారం. తొందర్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు..


Click it and Unblock the Notifications











