రజనీతో కత్రినా రొమాన్స్‌పై మళ్లీ సందిగ్దం
తీవ్ర అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజనీ సరసన చివరకు కత్రినాను ఖరారు చేసినట్లు, త్వరలో ఈ విషయమై సౌందర్య అధికారిక ప్రకటన చేస్తుందనే వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలను సౌందర్య పబ్లిసిస్ట్ ఖండించారు. చాలా మంది హీరోయిన్లతో పాటు కత్రినాను తీసుకోవడంపై కూడా చర్చించిన మాట వాస్తవమే, అయితే ఇప్పటి వరకైతే ఖరారు కాలేదు. మరో రెండు మూడు రోజుల్లో ఫైనల్ నిర్ణయం వెల్లడిస్తామని చెప్పారు.
గతంలో రజనీ సరసన సౌందర్య, అనుష్క శెట్టి, విద్యాబాలన్లు ఎంపిక చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. రజనీకి సంబంధించిన ఏ సినిమా అయినా హీరోయిన్ల ఎంపిక విషయమై ముందు ఇలాంటి ప్రచారమే జరుగుతోంది. కొచ్చాడయాన్ విషయంలోనూ ఇదే జరుగడం గమనార్హం.


Click it and Unblock the Notifications











