పనిమనిషి కన్నా హీనంగా ట్రీట్ చేసారంటున్న హీరోయిన్
తమిళ,మళయాళ హీరోయిన్ కావ్య మాధవన్ ఇటీవల తన భర్త నిషాల్ చంద్ర నుంచి విడాకులు కోరుతూ పిటీషన్ ధాకలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..పెళ్ళయిన తర్వాత సుఖమన్నది మర్చిపోయారని, తన అత్తింటివారు,భర్త తనను పనిమనిషి కన్నా హీనంగా ట్రీట్ చేసారని వాపోయింది. అలాగే తన చేతే ఇంటి పనంతా చేయించేవారని, అది చాలదన్నట్లు రకరకాల సూటిపోటి మాటలతో టార్చర్ పెట్టేవారని అంది. ఇక తనను అనుమానించేవారని, ఆ టార్చర్ ని భరించటం కష్టమయ్యే వివాహం రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నానని అంది. ఇక కావ్య మాదవన్...కాశీ, అపరిచితన్, క్లాస్ మేట్స్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో చేసింది. అలాగే ప్రస్తుతం క్రిష్టియన్ బ్రదర్శ్, తంబి దురై అనే చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications











