2000 కోట్ల కలెక్షన్లు కొడతాం.. బాక్సాఫీస్ షేక్ చేస్తాం..కంగువా నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పలు భారీ సినిమాల తాలూకా పోటెన్సియల్ ఎలా పెరిగుతూ వస్తుందో తెలిసిందే. కాగా ఇంకొన్ని సినిమాలు భారీ హైప్ గాని మాంచి తారాగణం ఉంటే గనుక ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ సెట్ చేస్తుంది. కాగా రానున్న రోజుల్లో ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్ అనేది కొంచెం ఈజీ అంశం గానే కనిపిస్తోంది.

ఓవర్సీస్ ఇక్కడ వసూళ్ళు కలిపి కొన్ని చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతున్నాయి. అయితే ఇండియన్ సినిమా దగ్గర తెలుగు, హిందీ, కన్నడ ఇండస్ట్రీలు ఈ 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాయి. కానీ ఎన్నో ఏళ్ళు నుంచి తమిళ సినిమాకి ఇది అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. ఎప్పుడో 2018 లో రజినీకాంత్ శంకర్ ల 2.0 సినిమా 800 కోట్ల దగ్గర ఆగిపోయింది.

KE Gnanavel Raja confident of Kanguva scores 2000 Crores at box-office

ఇక అక్కడ నుంచి ఎన్నో భారీ సినిమాలు వచ్చాయి కానీ ఏది ఆ మార్క్ ని కూడా క్రాస్ చెయ్యలేదు. కానీ ఇప్పుడు ఓ తమిళ నిర్మాత తమ సినిమాతో ఏకంగా 1000 కోట్లు కాదు 2000 వేల కోట్ల గ్రాస్ ని కొల్లగొడతాం అని అంటున్నారు. మరి ఆ సినిమానే సూర్య నటిస్తున్న సెన్సేషనల్ చిత్రం "కంగువా" కాగా ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న తమిళ నిర్మాత జ్ఞానవేల్ చేసినట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ లో వీరి నుంచి ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమా విషయంలో చేసిన కామెంట్స్ మాత్రం ట్రోల్స్ కి గురవుతున్నాయి. ఇప్పుడు భారీ స్టార్డం ఉన్న హీరోలకే 1000 కోట్ల మార్క్ అనేది యునానిమాస్ టాక్ పడినా కూడా అది కష్టం గానే కనిపిస్తుంది. అలాంటిది వీరు ఫస్ట్ సినిమా కూడా విడుదల కాకుండానే వెయ్యి రెండు వేల కోట్లు అంటూ చెప్పడం వీరు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారని ట్రోల్స్ వస్తున్నాయి.

KE Gnanavel Raja confident of Kanguva scores 2000 Crores at box-office

సూర్య మార్కెట్ అంతంత మాత్రమే అయినా కూడా ఈ రేంజ్ లో వీరే ఈ రేంజ్ లో మాట్లాడ్డం ఇపుడు చర్చగా మారింది. ఆల్రెడీ చాలా లేట్ అవుతూ వస్తున్న ఈ సినిమాపై మరీ అన్ని అంచనాలు అయితే లేవు. ముందు 1000 కోట్ల రేంజ్ అంచనాలు అసలే లేవు.. ఇక 2000 కోట్ల మాట అయితే దేవుడే ఎరుగు. మరి కంగువా వచ్చాక ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి.

ఇక ఈ చిత్రానికి దర్శకుడు శివ వర్క్ చేయగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించారు. అలాగే ఈ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి డబ్బింగ్ కోసం సూర్య గొంతుతో కొత్తగా ఏఐ సాయాన్ని తీసుకొని ఇంగ్లీష్ తదితర ఇంటర్నేషనల్ భాషల్లో విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: suriya kanguva disha patani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X