మణిరత్నం'అమృత'పాప ఇప్పుడు ఇలా...

By Srikanya

చెన్నై: మణిరత్నం చిత్రం 'అమృత'లో సుందరి అంటూ పాడించుకున్న చిన్న పాప గుర్తుందా...ఆమె ఇప్పుడు ఆ ఫోటో కనిపిస్తున్నంత పెద్దదైంది. తమిళ హీరో,దర్శకుడు పార్ధీపన్ కూతురైన ఆమె పేరు కీర్తన. ఆమె తాజాగా అజిత్ చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గా చేరటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అజిత్ చిత్రానికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ తో పంజా చిత్రం చేసిన విష్ణు వర్ధన్ ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు.

అజిత్ రికమండేషన్ తో డైరక్షన్ టీమ్ లోకి వచ్చిన కీర్తన ముంబై షెడ్యూల్ నుంచి ఈ షూటింగ్ కి అటెండవుతోంది. ఈ సినిమాలో అజిత్ హ్యాకర్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ సినిమాలో ఆర్య,నయనతార,తాప్కీ మిగతా ముఖ్యపాత్రల్లో కనపించనున్నారు. యవన్ శంకర్ రాజా సంగీతం అందించే ఈ చిత్రం షూటింగ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ రీసెంట్ గా చిత్రీకరించారు.

ఇక ఈ చిత్రంలో దగ్గుపాటి రానా గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో సైతం విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగినట్లు షూటింగ్ దశలోనే ఆన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో అజిత్,విష్ణు వర్దన్ కాంబినేషన్ లో బిళ్ళా చిత్రం వచ్చి మంచి విజయవంతం అయ్యింది. దాంతో ఈ కాంబినేషన్ పై ట్రేడ్ లో మంచి క్రేజ్ ఉంటుందని భావిస్తున్నారు.

అమృత చిత్రంలో మాధవన్‌, సిమ్రాన్‌, బేబి కీర్తన,నందితాదాస్‌, జె.డి.చక్రవర్తి, ప్రకాష్‌ రాజ్‌ నటించారు. రవి.కె.చంద్రన్‌, ఎఆర్.రహమాన్ వంటి హేమాహేమీలు పనిచేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. కధ అమృత చుట్టూ సాగుతుంది. ఇందులో జెడీ చక్రవర్తి తమిళ ఈళం టెర్రరిస్ట్‌ గా కనిపిస్తారు. ఇంజనీర్‌ కమ్‌ రైటర్ గా మాధవన్‌ కనిపిస్తారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ఈ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X