నచ్చకపోయినా.. సీఎం కొడుకు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీర్తి సురేష్..?
మహానటి సినిమాతో మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. గ్లామర్ డోస్ పెంచకుండానే అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ప్రస్తుత కాలంలో అందాల ప్రదర్శన ఎక్కువగా ఉంటేనే సినిమా అవకాశాలు వస్తాయి అని అపోహలకు కీర్తి సురేష్ ఒక విధంగా చెక్ పెట్టింది అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె అనవసరంగా ఏ సినిమాలో గ్లామర్ డోస్ పెంచిన సందర్భం లేదు. ఇటీవల కీర్తి సురేష్ నచ్చకపోయినా కూడా సీఎం కొడుకు కోసం ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి.

హీరోలు కూడా ఫ్యాన్స్ అయ్యేలా..
కీర్తి సురేష్ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుందని చాలా సార్లు రుజువైంది. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించిన విధానానికి చాలామంది హీరోలు కూడా ఆమెకు అభిమానులు అయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కూడా కీర్తి సురేష్ సావిత్రి ఫస్ట్ లుక్ చూడగానే ఆమెతో నటించాలని సర్కార్ సినిమాలో అవకాశం కూడా ఇప్పించాడు.

నచ్చకపోతే రిజెక్ట్..
కీర్తి సురేష్ మంచి నటిగానే కాకుండా క్రమశిక్షణ గల యాక్టర్ గా కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆమెకు పారితోషికంతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేసేందుకు ఒప్పుకుంది. నచ్చకపోతే మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా ఆమె సినిమా చేసేందుకు ఒప్పుకోదు. గతంలో కొన్ని పెద్ద సినిమాలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అవసరం అయితేనే..
గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా కీర్తి సురేష్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అనవసరంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించను అని ఆమె చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ సినిమా కథలో ఆ సన్నివేశాలు అవసరమైతేనే రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తానని కూడా తెలియజేసింది. ఇక రంగ్ దే సినిమాలో కాస్త రొమాంటిక్ గా నటించగా ఆ సినిమా ప్లాప్ అయ్యింది.

చేతిలో పెద్ద సినిమాలు
అయితే కీర్తి సురేష్ గతకొంతకాలంగా ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలను అందుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మంచి సినిమాలు ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా సక్సెస్ అయ్యే విధంగా ఉండాలి అని కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి తో బోళా శంకర్ అనే సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

సీఎం కొడుకు..
అలాగే తమిళంలో కూడా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎస్ కే.స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మరో సినిమా చేయడానికి ఇటీవల ప్రణాళికలు రచించాడు. గత ఎన్నికల్లో అతను చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుండి తమిళనాడు శాసనసభ సభ్యుడుగా ఎన్నికైన విషయం తెలిసిందే. కేవలం రాజకీయాలతోనే కాకుండా మరోవైపు సినిమాలతో కూడా బిజీ అవ్వాలని హీరో మంచి కథలను సెలెక్ట్ చేసుకున్నాడు.

నచ్చకపోయినా..?
ఇటీవల స్టాలిన్ చేయబోయే తదుపరి సినిమా కోసం కీర్తి సురేష్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మొదట కీర్తిసురేష్ సినిమా చేసేందుకు చాలా ఆలోచించినట్లు కూడా తమిళ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సీఎం కొడుకు అనే ఒక కారణం చేత కీర్తి సురేష్ ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుందని కూడా కోలీవుడ్ మీడియాలో కథనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి కీర్తి ఆ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











