కీర్తీ సురేష్ టాలెంట్.. విజయ్‌కు స్పెషల్ విషెస్
మహానటి కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కీర్తి సురేష్‌కు నటనే కాకుండా మరో ప్రతిభ దాగి ఉందని తెలుస్తోంది. ప్రొఫెషనల్ మ్యూజిషియన్‌లా కీర్తి సురేష్ వయోలిన్‌ను వాయిస్తోంది. అయితే ఇది కూడా ఇళయ దళపతి విజయ్ కోసం. నేడు విజయ్ పుట్టిన రోజు ఈ సందర్భంగా విజయ్‌కు ఇలా ప్రేమకు బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ మేరకు కీర్తి వయోలిన్ మీద వాయించిన పాట తెగ వైరల్ అవుతోంది. ఓ సారి ఆ కథ ఏంటో చూద్దాం.
కీర్తి సురేష్ విజయ్ కలిసి సర్కార్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏర్పడిన స్నేహాన్ని ఇలా వ్యక్త పరిచింది. కీర్తి సురేష్ ఈ మధ్యే పెంగ్విన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే కథ కథనాలను పక్కన బెడితే ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఓటీటీలో రిలీజ్ చేయడంతో కొద్ది మందికే అది రీచ్ అయింది. పెంగ్విన్ చిత్రంతో వార్తల్లో నిలిచిన కీర్తి ప్రస్తుతం వయోలిన్ వాయించి హల్చల్ చేస్తోంది.

దళపతి విజయ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. విజయ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ వారం రోజులు ముందుగానే మొదలయ్యాయి. విజయ్ బర్త్ డే సందర్భంగా కామన్ డీపీనీ దక్షిణాది సెలెబ్రిటీలందరి చేత రిలీజ్ చేయించారు. అందులో కీర్తి సురేష్ కూడా ఒకరు.తాజాగా విజయ్ కోసం వయోలిన్ వాయించి కుట్టి స్టోరీ పాటను మరింత అందంగా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ చేసిన మాస్టర్ చిత్రంలోని కుట్టి స్టోరీ పాట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











