కీర్తీ సురేష్ కి బ్యాడ్ టైం.. అస్సలు బజ్ లేకుండా..!

సౌత్ ఇండియా సినిమా దగ్గర ఇప్పుడు ఉన్న పలువురు స్టార్ హీరోయిన్స్ లో తమ కెరీర్ ని ఒకలా మొదలు పెట్టి ఇపుడు మరోలా వెళుతున్న హీరోయిన్స్ కొంతమంది అయితే ఉన్నారు. తమ కెరీర్ స్టార్టింగ్ లో చాలా హోమ్లీగా ఎలాంటి స్కిన్ షోలు లేకుండా కేవలం పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకునే హీరోయిన్స్ పరిస్థితి ఇప్పుడు అప్పటిలా లేదు. దీనితో వారు కూడా పెదవి ముద్దులు.. స్కిన్ షో లు ఎక్స్ పోజింగ్ లు చేయక తప్పడం లేదు..

కాగా ఈ లిస్ట్ లో ఐతే తమిళ నటి కీర్తి సురేష్ కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తెలుగులో నేను శైలజ సినిమాతో కన్పించి అందరినీ మెప్పించింది. అలా స్టార్టింగ్ లో బాగానే కనిపించింది కానీ ఇపుడు ఆఫర్స్ కోసమో లేక క్రేజ్ కోసమో లేదా.. ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం కోసమో కానీ తాను కూడా ఎక్స్ పోజింగ్ స్టార్ట్ చేసింది. రీసెంట్ గా కొన్ని ఫొటోస్ అయితే షాకిచ్చాయి.

keerthy sureshs bad time still continues no buzz for her raghu thatha

కాగా సినిమాల్లోకి వచ్చినట్టు అయితే ఈ మధ్య కీర్తి సురేష్ సినిమాలు కాస్త తగ్గాయనే చెప్పాలి. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట చేసింది తర్వాత మళ్ళీ కనిపించలేదు. తర్వాత తమిళ్ డబ్బింగ్ సినిమా "మామన్నన్" తెలుగులో 'నాయకుడు' గా రిలీజ్ అయ్యింది కానీ ఈ సినిమా కూడా కీర్తి కెరీర్ లో మరీ అంత ఫేమ్ ని ఇచ్చేయలేదు. దీనితో కీర్తి సురేష్ కి బ్యాడ్ టైం కంటిన్యూ అవుతూనే వస్తుంది.

అలాగే తెలుగులో ఆఫర్స్ కూడా తగ్గడంతో తమిళ్ లో సినిమాలు చేస్తుంది. కాగా తమిళ్ లో ఈమె చేసిన తాజా చిత్రమే "రఘు తాత". ఈ చిత్రం తమిళ్ లో అలాగే తెలుగులో కూడా రిలీజ్ అన్నట్టు అనౌన్స్ చేసారు కానీ కీర్తి పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఆగస్ట్ 15 రిలీజ్ అయితే తెలుగు సంగతి పక్కన పెడితే తమిళ్ లో కూడా మినిమమ్ బజ్ ని కూడా ఈ సినిమా జెనరేట్ చేయలేకపోయింది.

keerthy sureshs bad time still continues no buzz for her raghu thatha

ఇది మాత్రం కీర్తి సురేష్ కెరీర్ లో ఎంత డౌన్ ఫాల్ అనేది అర్ధం చేసుకోవాలి. ఒక టైం లో తెలుగు, తమిళంలో సమానమైన మార్కెట్ కలిగి ఉన్న కీర్తి ఇపుడు తెలుగులో కూడా తన సినిమా రిలీజ్ చేసుకోలేని పరిస్థితికి వస్తే.. అటు తమిళ్ లో కూడా తన సినిమాకి ప్రమోషన్స్ చేసుకున్నా కూడా మినిమం బజ్ ని ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని స్థాయికి పడిపోయింది.

సో మొత్తానికి మాత్రం కీర్తి సురేష్ బ్యాడ్ టైం ఇంకా కంటిన్యూ అవుతుందనే చెప్పాలి. ఇపుడు అయితే సౌత్ పక్కన పెట్టి హిందీ ఇండస్ట్రీలో తన ఎంట్రీని ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. హిందీలో "బేబీ జాన్" అనే సినిమా ఆమె చేస్తుండగా దీనిపైనే అన్ని అసలు పెట్టుకుంది. అలాగే ఈ సినిమాలో ఆమెపై మంచి బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. మరి అక్కడైనా కీర్తికి దశ తిరుగుతుందో లేదో చూడాలి.

More from Filmibeat

Read more about: keerthy suresh baby john
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X