సూర్యకు మరో బిగ్ షాక్.. తదుపరి కార్యాచరణ ఏంటో?
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దాదాపు గత యాభై రోజులుగా లాక్ డౌన్‌ను పాటిస్తూ వస్తున్నాం. ఈ కారణంగా ఎన్నో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. అందులో ముఖ్యంగా సినీ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బతగిలింది. విడుదల కావాల్సిన సినిమాలు ఆగిపోయాయి. షూటింగ్స్ జరగకపోవడంతో కార్మికులంతా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. నిర్మాతల అప్పులు కుప్పుల్లా పెరిగిపోతున్నాయి.
ఇలాంటి తరుణంలో కొంతమంది తమ చిత్రాలను ఓటీటీ ఫ్లాట్‌పామ్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆ రకంగానైనా కొంత నష్టం పూడ్చగలుగుతామని కొందరు అటువైపుగా అడుగులేస్తున్నారు. తెలుగులో ఈపాటికే అమృత రామమ్ అనే చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అయితే సూర్య నిర్మించిన ఓ చిత్రాన్ని కూడా ఇదే విధంగా విడుదల చేద్దామని భావించాడు.

సూర్య నిర్మించిన పొన్‌మగల్ వందాల్ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. దీంతో సూర్యపై థియేటర్ల యాజమాన్యం పోరాటాన్ని ప్రకటించింది. ఇకపై సూర్య నిర్మించే ఎలాంటి చిత్రాలను తమ థియేటర్‌లలో విడుదల చేయబోమని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేరళ సినీ థియేటర్ల సంఘం కూడా సూర్యకు షాక్ ఇచ్చింది.
ఆన్‌లైన్‌లో చిత్రాలను విడుదల చేయాలని తీసుకున్న సూర్య నిర్ణయాన్ని ఆ సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. తాము కూడా సూర్య నిర్మించే, నటించే చిత్రాలను విడుదల చేయబోమని వెల్లడించింది. మరి దీంతో సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











