KH x RK Glimpse: 47 ఏళ్ల తర్వాత రజనీ-కమల్ మల్టీస్టారర్.. ఇంతకీ హీరో ఎవరు?

KH x RK Glimpse: భారతీయ సినిమా చరిత్రలో అరుదైన క్షణం ఇప్పుడు నిజం కాబోతోంది. తమిళ సినీ పరిశ్రమలోని లెజండరీ యాక్టర్స్ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాంత్(Rajinikanth), ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan)కలిసి నటించబోతున్నారు. వీరిద్దరూ దాదాపు 47 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కలిసి వెండితెరపై కనిపించబోతున్నారు. దీంతో సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ లెజెండరీ కాంబినేషన్‌తో తెరకెక్కనున్న మల్టీస్టారర్‌ను 'KHxRK' అనే వర్కింగ్ టైటిల్‌తో అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'జైలర్'తో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar)దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత బాధ్యతలను యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)చేపట్టగా, భారీ బడ్జెట్‌తో రెడ్ జెయింట్ (Red Giant Movies)ఈ సినమాని నిర్మిస్తోంది.రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మూవీ కామెడీ, నాస్టాల్జియా, విజువల్స్ మేళవింపుతో కూడిన ఒక వినూత్న ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ప్రోమో స్పష్టం చేస్తోంది.

KH x RK Glimpse Rajinikanth-Kamal Haasan Reunion After 47 Years Sparks Massive Buzz

శుక్రవారం అర్ధరాత్రి విడుదలైన దాదాపు మూడు నిమిషాల అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో తుఫాన్‌లా వైరల్ అవుతోంది. రజినీకాంత్ తన ట్రేడ్‌మార్క్ స్వాగ్‌తో, కమల్ హాసన్ తన క్లాసిక్ ఎలిగెన్స్‌తో మెరిశారు. కాస్ట్యూమ్స్ నుంచి వాకింగ్ స్టైల్ వరకూ ప్రతి ఫ్రేమ్‌లో ఇద్దరి డామినేషన్ కనిపించేలా ఓ స్పెషల్ వీడియోను రూపొందించారు. నెల్సన్ కన్ఫ్యూజన్‌లో ఉండడం, అనిరుధ్ ట్యూన్ సెలక్షన్ కామెడీ టచ్, ఇద్దరు హీరోలు స్టైలిష్‌గా ఎదురెదురుగా నిలబడే షాట్స్ ఇవన్నీ అభిమానులకు డబుల్ థ్రిల్ ఇచ్చాయి. ఇక చివర్లో 'హీరో ఎవరు?' అనే డైలాగ్‌తో గ్లింప్స్ ముగియడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

రజనీ-కమల్ వంటి దిగ్గజాలను నెల్సన్ ఎలా హ్యాండిల్ చేస్తాడన్న సందేహాలకు గ్లింప్స్ సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది. హ్యూమర్, స్టైల్, మాస్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ఈ మల్టీస్టారర్‌ను భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ఇది కేవలం ఫ్యాన్ సర్వీస్ మూవీ కాదు... నాస్టాల్జియా,ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో రూపొందనున్న ప్రత్యేక మూవీ అని వీడియోనే చెబుతోంది. ఇక గ్లింప్స్‌లో వినిపించిన అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది.

రజనీ-కమల్ గతంలో కలిసి నటించినప్పటికీ, దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ రీయూనియన్ జరగడం భారతీయ సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది. ప్రస్తుతం రజినీకాంత్ 'జైలర్ 2', ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండగా... కమల్ హాసన్ కూడా పలు పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి నటిస్తుండటం సినిమాపై భారీ అంచనాలను నెలకొన్నాయి. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ ఈ మల్టీ స్టారర్ మూవీలో హీరో ఎవరు? అనేది చర్చనీయంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X