కాలుమీద కాలేసుకుని కూర్చున్న కుష్బూ!
కుష్బూ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. ఈ మారు సెక్స్ గురించి మాట్లాడి మాత్రం కాదు. హిందువుల సెంటిమెంటును తక్కువచేసి. ఒకవారం క్రితం ఒక సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతల విగ్రహాలకు దగ్గరగా చెప్పులు వేసుకుని కాలుమీదకాలు వేసుకొని కుర్చీలో కూర్చుంది. ఇలా కూర్చోవడం హిందువుల నమ్మకాలను కించపరచడమేనంటూ హిందూ మున్నాని కార్యకర్త గురుమూర్తి కోర్టులో కేసు వేశాడు.
వెల్లమాయి తరాయో సినిమా ప్రారంభోత్సవం నవంబర్ 22న జరిగింది. ఈ సందర్భంగా దేవతల విగ్రహాల పక్కన కుర్చీలో చెప్పులువేసుకుని కాలుమీద కాలు వేసుకుని కూర్చుంది. ఇలా కూర్చోవడాన్ని ఒక తమిళ వీక్లీ ప్రచురించింది. ప్రైవేట్ చానెళ్లు ప్రసారం చేశాయి. ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా రచయిత శివశంకరి, ఐపిఎస్ అధికారి తిలకవతి కూడా పాల్గొన్నారు. ఇందరి సమక్షంలో కుష్బూ హిందువుల నమ్మకాలను దెబ్బకొట్టే విధంగా కూర్చుందని గురుమూర్తి సెక్షన్ 295, 295(ఎ) కింద కేసు నమోదు చేశాడు. పిటిషన్ ను పరిశీలించిన జడ్జి కేసును డిసెంబర్ 3కు పోస్ట్ చేశారు.


Click it and Unblock the Notifications











