twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్ని మతాలను గౌరవిస్తా

    By Staff
    |


    ఒకవారం క్రితం ఒక సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మీ, పార్వతి, సరస్వతి దేవతల విగ్రహాలకు దగ్గరగా చెప్పులు వేసుకుని కాలుమీదకాలు వేసుకొని కుర్చుని వార్తల్లోకి ఎక్కిన ఖుష్బూ ఇపుడు ఆ సంఘటనకు వివరణ ఇచ్చుకుంటోంది. కాలుమీదకాలు వేసుకొని కూర్చోవడం హిందువుల నమ్మకాలను కించపరచడమేనంటూ హిందూ మున్నాని కార్యకర్త గురుమూర్తి కోర్టులో కేసు వేసిన దానికి సమాధానం ఇచ్చింది. ఆమె మాటల్లోనే...నాకు అన్ని మతాలూ సమానమే...ఏ మతం పట్ల నాకు చిన్నచూపు లేదు..ఈ విషయంలో నేనెప్పుడూ ఎవరినీ అగౌరవపరచలేదు..అందరినీ గౌరవిస్తాను...గురుమూర్తి కేసు విషయంలో నేనేం తప్పుచేసినట్టు భావించడంలేదు. తదుపరి ఏం చేయాలన్నది నా లాయర్లను సంప్రదించిన తరువాత చెబుతాను..ఎవరుకూడా ఇతరుల సెంటిమెంట్లను దెబ్బకొట్టాలనుకోరు..అదో పెద్ద ప్రారోంభోత్సవ కార్యక్రమం..అంతా సర్దుకుంటుందని భావిస్తున్నాను...అంది ఖుష్బూ. ప్రస్తుతం గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఖుష్బూ ఉంది.

    ఖుష్బూ కాలుమీద కాలు వెసుకుని కూర్చున్న సంఘటన వెల్లమాయి తరాయో సినిమా ప్రారంభోత్సవం రోజైన నవంబర్ 22న జరిగింది. ఈ సందర్భంగా దేవతల విగ్రహాల పక్కన కుర్చీలో చెప్పులువేసుకుని కాలుమీద కాలు వేసుకుని కూర్చుంది.

    Read more about: khushboo temples footwear
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X