ఖుష్బూ కేసు నవంబర్ కి వాయిదా

By Srikanya

అసెంబ్లీ ఎన్నికల తీర్పుపై నటీ ఖుష్బూ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సేలం కోర్టు నవంబర్ ఒకటవ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సేలం జిల్లా, తాదగాపట్టి ప్రాంతానికి చెందిన అరివళగన్ న్యాయవాది. ఈయన సేలం నాలుగో మెజిస్ట్రేట్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో రాష్ట్రంలో ఏప్రిల్ నెల 13వ తే దీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించిందని తెలిపారు. అరుతే ఎన్నికల ఫలితాలకు సంబంధించి డీఎంకేకు చెందిన నటి ఖుష్బు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలుకాలేదని, ప్రజా ఓటమిగా వ్యాఖ్యానించినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రజలు ఈ ఐదేళ్లు అష్టకష్టాలు పడతారని ఆమె ప్రసంగించినట్లు ఆరోపించారు. ఖుష్బూ చేసిన వ్యాఖ్యలతో తాను మనస్థాపం చెందినట్టు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి శ్రీవిద్యా సమక్షంలో మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది. కేసు విచారణను న్యాయస్థానం నవంబర్ ఒకటవ తేదీకి వాయిదా వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X