రజనీకాంత్‌తో అవకాశం వచ్చినా నటించను: ఖుష్భూ

By Bojja Kumar

హైదరాబాద్: తన వ్యవహార శైలితో సంచలనాలు సృష్టిస్తూ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా ఉండే ఖుష్బూ మరోసారి అలాంటి పనే చేసారు. తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కమల్ హాసన్‌తో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని చెప్పిన ఆమె, రజనీకాంత్‌తో అవకాశం వచ్చినా నటించను అనే విధంగా ఆమె సమాధానాల ఉండటమే ఇందుకు కారణం. ట్విట్టర్లోతన అభిమానులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన 'ధర్మత్తిన్‌ తలైవన్‌' చిత్రంతో కోలీవుడ్‌ను చూసిన కుష్బూ.. ఒక్క చిత్రంతోనే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఎక్కడో ముంబయిలో పుట్టి పెరిగినా.. తమిళుల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి కుష్బూ. అభిమానులతో ఆలయాన్ని కట్టించుకున్న ఈ సుందరాంగి వెండితెర కెరీర్‌ వెనకబడటంతో .. బుల్లితెరపైకి వచ్చింది.

Khushboo say no to Rajini?

తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కుష్బూ అందచందాలు, అభినయం ఉండటంతో.. తక్కువ సమయంలోనే ఫాలోయింగ్‌ పెరిగింది. ఆ తర్వాత కమల్‌, సత్యరాజ్‌, ప్రభు వంటి అగ్ర హీరోలతోనూ అమ్మడు ఆడిపాడింది. 'చిన్నతంబి' చిత్రంలో ఊహించని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది కుష్బూ. ఇందులో ప్రభు, కుష్బూ జోడీ అందరకీ నచ్చడంతో.. ఈ జంట మరిన్ని చిత్రాల్లో కనువిందు చేసింది. కథానాయిక పాత్రలు తగ్గాక.. ఇతర పాత్రల్లో కూడా నటించింది. కన్నడ, మలయాళం, తెలుగులోనూ వందలాది చిత్రాల్లో నటించింది.

ఆమెకు వెండితెరలో అవకాశాలు తగ్గినా.. వెంటనే బుల్లితెర అండగా నిలిచింది. తమిళంలోని ఓ ప్రైవేటు ఛానల్‌లో ఆమె నటించిన 'జనని', 'కుంగుమం' ధారావాహికలు ఆమెకు మరింత ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. స్వీయ నిర్మాణంలో పలు ధారావాహికలను కూడా నిర్మించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X