For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హత్య చేయడాని ప్లాన్ చేశారు.. అది యాక్సిడెంట్ కాదు.. ఖుష్బూ సంచలన ఆరోపణలు

  |

  సినిమా ఇండస్ట్రీలోనో కాకుండా రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిన ఖుష్బూ యాక్సిడెంట్ పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం ఎవరు ఊహించని విధంగా రోడ్డు ప్రమాదానికి గురైన ఖుష్బూ తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుంది. ఒక్కసారిగా ఈ న్యూస్ అందరిని షాక్ కి గురి చేసింది. కారు కూడా డ్యామేజ్ కావడంతో ఆమె అభిమానులు సన్నిహితులు ఆమె క్షేమం గురించి అధికారికంగా తెలిపే వరకు ఆందోళన చెందారు.

  అనుమానాలను నిజం చేసిన ఖుష్బూ

  అనుమానాలను నిజం చేసిన ఖుష్బూ

  నటిగా ఒకప్పుడు తమిళ్, తెలుగు భాషల్లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కీలక అడుగులు వేస్తోంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆమె ఇటీవల భారత జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి బీజేపీపై పాజిటివ్ గానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో ఆమె పార్టీ మారబోతున్నారు అనే అనుమానాలను కొన్ని రోజుల్లోనే నిజం చేశారు.

  మార్గం మధ్యలో కారు ప్రమాదం

  మార్గం మధ్యలో కారు ప్రమాదం

  ఇక బుధవారం ఉదయం ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కడలూరులో జరిగే వేల్ యాత్ర కోసమని బయలుదేరిన ఖుష్బూకు మార్గం మధ్యలో అనుకోని ప్రమాదం ఎదురైంది. చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకం సమీపంలో ఒక ట్యాంకర్ ఆమె కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు ఒక భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.

  నుజ్జునుజ్జు కావడంతో ఇరుక్కుపోయిన ఖుష్బూ

  నుజ్జునుజ్జు కావడంతో ఇరుక్కుపోయిన ఖుష్బూ

  ఘటనలో కారు భాగం నుజ్జునుజ్జు కావడంతో ఖుష్బూ అందులోనే కొద్దిసేపటి వరకు ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు స్పందించి డ్రైవర్ మురుగన్ ని అలాగే ఖుష్బూని కారు నుంచి బయటకు తీశారు. కుష్బూకి పెద్దగా గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారణ జరిపారు.

   హత్య చేయడానికి కుట్ర..

  హత్య చేయడానికి కుట్ర..

  ఇక ఘటనపై స్పందించిన ఖుష్బూ సంచలన ఆరోపణలు చేశారు. అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని కావాలని హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. ఇది యాక్సిడెంట్ కాదని అర్ధమవుతోందని అంటూ.. ప్లాన్ ప్రకారం నన్ను హత్య చేయించడానికి కుట్ర జరిగింది. అందుకే సమగ్రమైన దర్యాప్తు చేపడితే అసలు నిజానిజాలు బయటకు వస్తాయని ఖుష్బూ వివరణ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

  Rowdy Baby Hits 1 Billion Views, Dhanush, Sai Pallavi Tweets
  బెదిరింపులు ఎక్కువయ్యాయి.. భయం లేదు

  బెదిరింపులు ఎక్కువయ్యాయి.. భయం లేదు

  బీజేపీ నాయకులు కూడా ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను భారత జనతా పార్టీలో ఎప్పుడైతే చేరానో అప్పటి నుంచి కూడా బెదిరింపులు ఎక్కువవుతున్నట్లు చెప్పిన ఖుష్బూ ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా తాను ఎంత మాత్రం భయపడను అంటూ ప్రత్యర్థులకు హాచ్చరిక జారీ చేసింది. దీంతో రానున్న రోజుల్లో రాజకీయంగా తమిళనాడులో ఈ ఘటన మరింత కాంట్రవర్సీగా మారే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

  English summary
  Khushbu Sundar is an Indian film actress, producer and television presenter who has acted in more than 200 movies. She is predominantly known for her work in the South Indian film industry. She has received two Tamil Nadu State Film Awards for Best Actress and one Kerala State Film Award – Special Mention.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X