twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ కేనా మద్దతు స్పష్టం చేసిన ఖుష్బు: రజినీ కి వ్యతిరేక వర్గం కోలీవుడ్నుంచే ??

    కమల్‌కు సీనియర్‌ నటి, కాంగ్రెస్‌ నేత ఖుష్బూ మద్ధతు ప్రకటించింది. కమల్‌ రాజకీయాల్లోకి వస్తే నా మద్ధతు ఆయనకి ఉంటుంద’ని ట్వీట్‌ చేసింది

    |

    కమల్ హసన్, రజనికాంత్ మధ్య చాలా ఘాడమైన స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు "అంతులేనికథ లాంటి సినిమాలో ఇద్దరూ హీరోలు గా కాక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టుల్లా అక్నిపిస్తారు. ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయటానికి సిద్దంగానే ఉండేవాళ్ళు అయితే ఆ తర్వాత స్టార్ డమ్ పెరిగిపోవటం తో ఇద్దరికీ సరిపడే కథలు రాకపోవటం తో స్వచ్చందంగా మల్టీ స్టారర్స్ కి స్వస్తి పలికారు. ఇక వీలు దొరికినప్పుడంతా బయట తన స్నేహ బంధాన్ని చాటుకుంటూ ఉంటారు. కాని రాజకీయ పరంగా మాత్రం ఇద్దరి మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది.

    చాలా యాక్టివ్‌ అవుతున్నాడు

    చాలా యాక్టివ్‌ అవుతున్నాడు

    మొదటినుంచీ సొంత అభిప్రాయాల్లో కమల్ ఉండే పద్దతీ రజినీ ఉండే పద్దతీ వేరు రాజకీయాల్లో ఇద్దరూ కలిస్తే మాత్రం అది పెను మార్పులకి దారి తీసేస్ది. తమిళ రాజకీయాల రూపురేఖలే మారిపోయేవి కానీ అలా జరగలేదు. ఒకవైపు ‘బిగ్‌బాస్‌' షోను హోస్ట్‌ చేస్తున్న కమల్‌.. మరోవైపు రాజకీయంగా చాలా యాక్టివ్‌ అవుతున్నాడు.

    Recommended Video

    Bigg Boss Tamil : Case Filed Against Kamal Haasan for his show
    అవినీతి గురించి

    అవినీతి గురించి

    రాజకీయ విషయాల్లో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నాడు. మంత్రుల అవినీతి గురించి, తమిళనాడులోని పలు సమస్యల గురించి ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నిస్తు, తన మిత్రుడు, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ ప్రవేశం గురించి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కమల్.

    మనసులో మాట చెప్పేసాడు

    మనసులో మాట చెప్పేసాడు

    వచ్చే ఎన్నికలలో బిజెపి మద్దతు తీసుకునే ఉద్దేశంలో ఉన్నాడు రజని. కాని ప్రాంతీయ తత్వం బలంగా నాటుకున్న తమిళ రాజకీయ రంగంలో కేంద్ర పార్టీలు ఇమడవని కమల్ అభిప్రాయం. అది మరో సారి స్పష్టం చేసాడు కమల్. బిజెపి ఇక్కడ అధికారంలోకి రావాలి అనుకోవడం పగటి కలగానే మిగులుతుందని, ప్రాంతీయ పార్టీలదే ఇక్కడ రాజ్యం అని తన మనసులో మాట చెప్పేసాడు.

    పొలిటికల్ ఎంట్రీ ఖాయం

    పొలిటికల్ ఎంట్రీ ఖాయం

    అంటే ఒక విషయాన్ని చెప్పకనే చెప్పేసాడు. రజని ఒకవేళ బిజెపి సపోర్ట్ తీసుకున్నా కమల్ మాత్రం బీజేపీ తో కలవకుండా ఆపోజిట్ లోనే ఉంటాడన్నది స్పష్టం అయినట్టే. మరి రజని ఇంకా తన మనసులో ఏముందో పూర్తిగా బయట పెట్టలేదు. పొలిటికల్ ఎంట్రీ మాత్రం ఖాయం అని చెప్పేసాడు.

    కమల్‌ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నాడు?

    కమల్‌ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నాడు?

    అయితే ఇప్పుడు రజినీకి వ్యతిరేకంగా ఇంకో గ్రూపు కూడా మొదలవుతుందీ అన్న అనుమానము తాజా ఘటనలతో వచ్చేసింది. ఎందుకంటే కమల్‌ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. దానికి తగ్గట్టే కమల్ కూడా తాజా రాజకీయాల మీద తన స్టైల్లో స్పందిస్తూనే ఉన్నాడు.

    కమల్‌హాసన్‌ స్పందనను స్వాగతిస్తున్నా

    కమల్‌హాసన్‌ స్పందనను స్వాగతిస్తున్నా

    ఈ నేపథ్యంలో సీనియర్‌ నటి, కాంగ్రెస్‌ నేత ఖుష్బూ.. కమల్‌కు మద్ధతు ప్రకటించింది. ‘అవినీతికి వ్యతిరేకంగా కమల్‌హాసన్‌ స్పందనను స్వాగతిస్తున్నా. కమల్‌ రాజకీయాల్లోకి వస్తారని కొంత కాలంగా వార్తలు వినబడుతున్నాయి. నిజంగా నా స్నేహితుడు కమల్‌ రాజకీయాల్లోకి వస్తే నా మద్ధతు ఆయనకి ఉంటుంద'ని ట్వీట్‌ చేశారు ఖుష్బూ. సో..! రజినీకి గట్టి పోటీనే ఉండబోతుందీ అన్నదానికి ఇది ఒక సూచన అనుకోవచ్చా..??

    English summary
    The political statements made by Kamal has stirred a lot in the world of politics, says Kushboo who added that she is always willing to lend her full support to Kamal Haasan if he would enter politics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X