రూమర్లు వద్దు.. ఖుష్భు స్ట్రాంగ్ వార్నింగ్
ఇండియన్ సినిమా దగ్గర సీక్వెల్ సినిమాలు ఇప్పుడే ఊపందుకున్నాయి అంటే అది పొరపాటే అని చెప్పాలి.. ఎప్పుడు నుంచో సీక్వెల్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఇండియా లెవెల్లో వాటి రీచ్ ఉంది సో అందుకే సీక్వెల్స్ హవా బాగా కొనసాగుతుంది. అయితే ఈ పాన్ ఇండియా సీక్వెల్స్ కాకుండా మన సౌత్ సినిమా దగ్గర ఎప్పుడు నుంచో పలు భాషల్లో సీక్వెల్ సినిమాలు అలాగే ఫ్రాంచైజ్ సినిమాలే ఉన్నాయి.
అలా స్టార్ చేసిన ట్రెండ్ లో తమిళ సినిమా ముందు ఉంటుంది. అలా తమిళ్ సినిమా దగ్గర హారర్ కామెడీ సినిమా జానర్లో దర్శకుడు హీరో రాఘవ లారెన్స్ సినిమాలు ముని, కాంచన సిరీస్ ముందు వినిపిస్తాయి కానీ ఇదే తమిళ్ నుంచి వినిపించే మరో క్రేజీ హారర్ కామెడీ ఫ్రాంఛైజ్ కూడా ఉంది. అదే "అరణ్మనై" దర్శకుడు సి సుందర్ తెరకెక్కించిన ఈ ఫ్రాంచైజ్ లో మొత్తం 4 సినిమాలు ఈ పదేళ్లలో చేసారు.

కాగా ఈ అన్ని కూడా తెలుగులో విడుదల కూడా అయ్యాయి. అయితే లారెన్స్ ముని, కాంచన సిరీస్ రేంజ్ లో ఫేమ్ తెచ్చుకోలేదు కానీ రీసెంట్ గా వచ్చిన నాలుగో సినిమా బాక్ కి కొంచెం కాదు ఎక్కువే హాట్ నెస్ ని జోడించారు. మిల్కి బ్యూటీ తమన్నా, మరో గ్లామర్ బ్యూటి రాశి ఖన్నా లతో ఓ పక్క కావాల్సినంత హాట్ షో ఇంకో పక్క హారర్ కామెడీ ఎలిమెంట్స్ తో రిలీజ్ కి తీసుకొచ్చారు.
ఇంట్రెస్టింగ్ గా ఈ సినిమా తమిళ్ లో భారీ హిట్ అయ్యింది. తెలుగులో పెద్దగా ఆడలేదు కానీ తమిళ్ లో మాత్రం బాగానే హిట్టయ్యింది. అయితే ఇటీవల పార్ట్ 5 పై పలు షాకింగ్ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి. కాగా ఈ సినిమా వార్తలపై నటి ఖుష్బూ స్పందించడం జరిగింది.
ఖుష్బూ ఈ సినిమాల దర్శకుడు సుందర్ సి కి భార్య పైగా ఈ సినిమాలకి నిర్మాత కూడా దీనితో ఈ సినిమా పార్ట్ 5 పై వైరల్ అవుతున్న వార్తలపై గట్టి సమాధానం ఇచ్చారు. అరణ్మనై పేరిట ప్రచారం అవుతున్న వార్తల్లో అలాగే సినిమాకి ఎంపిక అయ్యిన నటులు, సాంకేతిక టీం ఇలా అన్ని వివరాలు కూడా అబద్ధం అని ఖండించారు.
There have been a lot of speculations and news circulating about the successful and the biggest entertainer of tamil cinema, #Aranmanai , getting ready for its 5th franchise. Pictures, startcast, firstlook, poster designs, and all. Everything is fake. Anyone doing business with… pic.twitter.com/aoIl5BEM0i
— KhushbuSundar (@khushsundar) October 26, 2024
అలాగే ఈ సినిమా విషయంలో ఏమన్నా స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటే తమ నుంచే వస్తాయి అని ఆమె సెలవిచ్చారు. అయితే దీనితో పాటుగా ఆమె కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆమె ఇదే పోస్ట్ లో తమ సినిమా పేరు వాడుకొని ఏదన్నా బిజినెస్ లాంటి డీల్స్ చేయాలని చూసినా వాటికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దీనితో ఈ అరణ్మనై పేరిట తమిళ్ లో వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. కాగా ఈ సినిమాకి అయితే ఐదో భాగం కూడా ఉంది కాని అది ఎప్పుడు ఏంటి అనేవి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











