కుష్బూ కూతుళ్ల జోరు మాములుగా లేదుగా.. ఆన్‌లైన్‌లో వీడియోల హల్‌చల్
ఉత్తరాది హీరోయిన్‌గా పరిచయమై దక్షిణాది సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన కుష్బూ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లుగా ఉన్నాయి. ఒక్కొక్క సక్సెస్‌ను తన సోపానంగా మార్చుకొని విజయశిఖరాలుకు చేరుకొన్నారు. నటిగా, రాజకీయ వేత్తగా జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. ఇలా తన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కుష్బూ అడుగు జాడల్లోనే తన కూతుళ్లు నడుస్తున్నారనే విషయం స్పష్టమవుతుంది. తాజా కుష్బూ కూతుళ్లు ప్రతిభ దక్షిణాది చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఆ ఇద్దరు కూతుళ్లు ఏం చేస్తున్నారంటే..

కుష్బూ సుందర్ కూతుళ్లు హంగామా
90వ దశకంలో సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన కుష్బూ దర్శకుడు సుందర్ సీతో ప్రేమలో పడింది. 1995లో మురై మాన్నన్ షూటింగ్‌లో జరిగిన పరిచయం వారి మధ్య ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత వారికి అవంతికి, ఆనందిత అనే ఇద్దరు కూతుళ్లు పుట్టారు. ప్రస్తుతం వారు లాక్‌డౌన్‌లో అందర్ని ఆకట్టుకునే విధంగా వీడియోలు చేసి ఆకర్షిస్తున్నారు.

లాక్‌డౌన్ ఫిట్‌నెస్ వీడియోలు
కొన్ని నెలల క్రితం వరకు అవంతిక, ఆనందిత ఇద్దరూ స్థూలకాయంతో బాధపడేవారు. లాక్‌డౌన్ వల్ల వచ్చిన అవకాశంతో వారిద్దరూ బరువు అనూహ్యంగా తగ్గి కొత్త లుక్‌తో ఎవరూ ఊహించిన ట్రాన్స్‌ఫర్మేషన్‌తో ముందుకు వచ్చారు. తాజాగా బరువు తగ్గిన వారిద్దరు ఆన్‌లైన్‌లో ఫిట్‌నెస్ పాఠాలు, మొటివేషనల్ లెస్సన్స్ మొదలుపెట్టారు. అందుకోసం వారిద్దరూ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించారు.

హెల్త్ టిప్స్ వీడియోలతో
గత మూడు నెలల క్వారంటైన్ సమయంలో వారు చేసిన యాక్టివిటీస్‌ను వీడియోలుగా చిత్రీకరించి షేర్ చేస్తున్నారు. హోస్ట్‌గా మారిన ఆ ఇద్దరు తమ ఆహారపు అలవాట్లు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అలాగే బ్యూటీ టిప్స్, వర్కువుట్ లాంటి విషయాలను చాలా ఆసక్తిగా చెప్పడంతో వీడియోలకు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. కుష్బూ కూతుళ్లు చేసిన వీడియోలు ఇప్పుడు ఆమె ఫ్యాన్స్‌ను, నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయనేది తాజా టాక్.

ఫ్యామిలీ రిలేషన్స్ గురించి
అలాగే కుటుంబంలో ప్రేమ, అనురాగాలు ఎలా ఉండాలనే కూడా కొన్ని వీడియోలను కూడా అవంతిక, ఆనందిత షేర్ చేశారు. తమ కుటుంబంలో ఉండే రిలేషన్స్‌ను ఉదాహరణగా చెప్పుకొంటూ జీవిత పాఠాలను బోధిస్తున్నారు. వయసులో చిన్నవారైన పరిణతితో పాఠాలు చెప్పడంతో వారి భారీగా ప్రశంసలు అందుతున్నాయి. ఇదే స్ఫూర్తితో మరింత సృజన్మాత్మక ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రజనీతో కుష్బూ మూవీ
ఇక కుష్బూ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్‌లో వస్తున్న అన్నాతే చిత్రంలో కుష్బూ నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రజనీకాంత్‌తో కుష్బూ జతకడుతున్నారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమిటనే విషయాన్ని సీక్రెట్‌గా పెడుతున్నారు. అలాగే అన్నాతేలో భారీగా ప్రముఖ నటీనటులు పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











