రజనీకాంత్‌పై విరుచుకుపడ్డ హీరోయిన్ కుష్బూ.. పాలిటికల్ ఎంట్రీ సంచలన వ్యాఖ్యలు

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఉన్నత శిఖరాలను దాటేసి ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఇక ఆయన చూడని స్టార్ డమ్ పెద్దగా లేదనే చెప్పవచ్చు. ఇకపోతే ఆయన రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి కుష్బూ కూడా తలైవా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

Recommended Video

Kushboo Made Comments on Rajinikanth's Political Entry
రజినీకాంత్ పాలిటిక్స్..

రజినీకాంత్ పాలిటిక్స్..

రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడని గత ఐదేళ్లుగా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. దివంగత ముఖ్యంగా జయలలిత మరణం తరువాత రజినీకాంత్ ఎప్పటికప్పుడు పాలిటిక్స్ పై స్పందిస్తూనే ఉన్నారు. తప్పకుండా రాజకీయాల్లో సరికొత్త మార్పులు చూడబోతున్నారు అంటూ అప్పట్లో ఊహకందని విదంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం సిద్ధమవుతున్నట్లు కూడా టాక్ వచ్చింది.

కుష్బూ కామెంట్స్..

కుష్బూ కామెంట్స్..

సీనియర్ హీరోయిన్ కుష్బూ సుందర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై తనదైన శైలిలో కామెంట్ చేశారు. తప్పకుండా ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అయితే ఆయాన్ కింగ్ మేకర్ కాకూడదు అంటూ.. డైరెక్ట్ గా కింగ్ అవ్వాలని కుష్బూ వివరణ ఇచ్చారు. గతంలో రజినీకాంత్ కేవలం పార్టీని నడిపిస్తూ కుదిరితే వేరోకొరని ముఖ్యమంత్రిగా నియమించడానికి ప్రయత్నం చేస్తానని ఒక కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఆ పేరు చూసే..

ఆ పేరు చూసే..

అదే విషయంపై స్పందించిన కుష్బూ ఆయన డైరెక్ట్ గా సీఎం అభ్యర్థిగా ఉంటే రజినీకాంత్ పేరు చూసే జనాలు ఓట్లు వేయడానికి సిద్ధమవుతారని ఆమె అన్నారు. అలాగే ప్రస్తుతం రజినీకాంత్ రాష్ట్రం గురించి ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో తెలియదని అన్నారు. గత కొంత కాలంగా కుష్బూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

రాజకీయాల్లోకి రావాలి

రాజకీయాల్లోకి రావాలి

ఇక రజినీకాంత్ రాజకీయాలతో పాటు కమల్ హసన్ పాలిటిక్స్ పై కూడా కుష్బూ పాజిటివ్ గా స్పందించారు. అలాగే రాజకీయాల్లోకి సినిమావాళ్ళు ఇంకా భారీ స్థాయిలో రావాలని, ముఖ్యంగా యువ హీరోలు నటీనటులు రాజకీయాలను మంచి భాటలో నడిపించాలని అన్నారు. ఇక ఫైనల్ గా రజినీకాంత్ త్వరలోనే పార్టీని ప్రారంభిస్తారనే విధంగా కుష్బూ కామెంట్ చేస్తుండడంతో తమిళనాడులో తలైవా పొలిటికల్ కెరీర్ పై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X