సీనియర్ నటి కుష్బూకు మోదీ ప్రభుత్వం అరుదైన గౌరవం.. జాతీయ మహిళా కమిషన్‌లో!
దక్షిణాదిలో సీనియర్ నటి కుష్బూ సుందర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కొద్ది నెలల క్రితం తమిళనాడు బీజేపీలో చేరిన ఆమెకు కేంద్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పదవితో ఆమెకు గౌరవాన్ని కట్టబెట్టింది. కొద్దికాలంగా పార్టీకి సేవలందిస్తున్న కుష్బూ జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఆమె పదవి కాలం మూడేళ్లపాటు ఉంటుంది. బీజేపీలో జాతీయ కార్గవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
కుష్బూ నియామకంపై బీజేపీ అధినాయకత్వం స్పందిస్తూ.. కొద్దికాలంగా మహిళల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. అందుకే ఆమె సేవలకు గుర్తింపుగా ఈ పదవికి నామినేట్ చేశారు అని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై అన్నారు.జాతీయ మహిళా కమిషన్‌లో కుష్బూ సుందర్‌తోపాటు మమతా కుమారీ, డెలీనా ఖోగ్డప్‌ను కూడా నామినేట్ చేశారు.

కుష్బూ కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులో వెంకటేష్‌తో కలిసి కలియుగ పాండవులు సినిమాతో కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత తమిళంలో అవకాశాలు రావడం, ఆమె నటించిన చిత్రాలు విజయవంతం కావడంతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయారు. ఆ తర్వాత సుందర్ అనే దర్శకుడిని పెళ్లి చేసుకొన్నారు. గత కొద్దికాలంగా తమిళ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటించారు. ప్రస్తుతం రామబాణం అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











