twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుష్బూ టేప్ లీక్.. వాట్సప్ గ్రూప్‌పై మండిపడిన సీనియర్ నటి.. సారీ చెబుతూ..

    |

    దక్షిణాది నటి కుష్బూ సుందర్ మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేసి సరికొత్త వివాదంలో ఇరుకున్నారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో టేప్ లీక్ కావడంతో వివాదంగా మారింది. టెలివిజన్ ప్రొడ్యూసర్‌కు పంపిన ఆడియో సందేశం లీక్ కావడంతో మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆమె క్షమాపణ చెబుతూ ట్విట్టర్‌లో ఏమని స్పందించారంటే...

     ఆడియో టేప్‌లోని వ్యాఖ్యలు నావి కావు

    ఆడియో టేప్‌లోని వ్యాఖ్యలు నావి కావు

    ఆడియో టేప్ లీక్‌ వ్యవహారంపై కుష్బూ స్పందిస్తూ.. సోషల్ మీడియాలో లీకైన ఆడియో టేప్ వాస్తవం కాదు. నేను మాట్లాడిన ఆడియో టేప్‌ను ఎడిట్ చేసి మార్చారు. అందులో ఉన్న వ్యాఖ్యలన్నీ నావి కాదు. మీడియా ప్రతినిధుల మనోభావాలు దెబ్బతీసి ఉన్నట్లయితే వారికి నేను క్షమాపణ చెబుతున్నాను అంటూ కుష్బూ ట్విట్టర్‌లో స్పందించారు.

    మీడియాను అనుమతించవద్దని

    మీడియాను అనుమతించవద్దని

    అయితే ఈ వివాదానికి అసలు కారణమైన సంఘటన ఏమిటంటే.. తమిళనాడు ప్రభుత్వం టెలివిజన్ సీరియల్స్ షూటింగ్స్‌ చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో బుల్లితెరకు సంబంధించిన టెక్నిషియన్లు, నిర్మాతలు సమావేశమయ్యారు. ఆ క్రమంలో మంగళవారం సీరియల్ షూటింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కుష్బూ స్పందిస్తూ.. సీరియల్ షూటింగ్ జరిగే సెట్స్‌లోకి మీడియా వాళ్లను అనుమతించవద్దు అంటూ కుష్బూ ఓ వాట్సప్ గ్రూప్‌లో తన ఆడియో సందేశాన్ని షేర్ చేశారు.

    మీడియాపై ఆంక్షలు విధించాలని

    మీడియాపై ఆంక్షలు విధించాలని

    కుష్బూ షేర్ చేసినట్టు భావిస్తున్న ఆడియో టేప్‌లో ఏమున్నందంటే.. మీడియా వాళ్లను సెట్స్‌లోకి వచ్చి వీడియోలు, ఫోటోలు తీసుకోవద్దని ఆంక్షలు విధించండి. వాళ్లు మన లోపాలను ఎత్తి చూపించడానికి రెడీగా ఉన్నారు. కొవిడ్ 19 సమయంలో మీడియా వాళ్లకు ఎలాంటి వార్తలు లేక న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక షూటింగులు మొదలైనవి కనుక ఏదో ఒకటి రాయడానికి రెడీగా ఉన్నారు. దయచేసి జాగ్రత్తలు తీసుకోండి అంటూ ఆడియోలో స్పష్టం చేసింది.

    నా వాయిస్‌ను ఎడిట్ చేసి

    నా వాయిస్‌ను ఎడిట్ చేసి

    ప్రస్తుతం లీకైన ఆడియో టేప్‌లో ఉన్నవి నా మాటలు కావని కుష్బూ ట్వీట్ చేశారు. మీడియా గురించి మాట్లాడినట్టు ఉన్న నా వాయిస్ మెసేజ్‌‌ను ఎడిట్ చేశారు. నిర్మాతల గ్రూప్ నుంచే దానిని లీక్ చేశారు. మనలోనే ఇలాంటి వాళ్లు ఉన్నందుకు సిగ్గు పడుతున్నాను. మీడియాను అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదు అని కుష్బూ ట్వీట్ చేశారు.

    Recommended Video

    Kushboo Made Comments on Rajinikanth's Political Entry
    34 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ

    34 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ

    మీడియా గురించి కుష్బూ స్పందిస్తూ.. ప్రెస్ అంటే నాకు విపరీతమైన అభిమానం, గౌరవం ఉంది. 34 ఏళ్ల కెరీర్‌లో నేను ఎప్పుడూ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గానీ, అమర్యాదగా ప్రవర్తించడం చేయలేదు. నా వాయిస్ ఆడియో ఫైల్ సగమే ఉంది. ఈ విషయంలో మీడియా వాళ్లు ఏమైనా బాధపడితే వారికి నా క్షమాపణలు తెలియజేస్తున్నాను అని ట్వీట్‌లో కుష్బూ పేర్కొన్నారు.

    English summary
    My voice message, an edited version, regarding the press is making rounds. It has gone from our producers group n I am ashamed to say we have such cheap minds among us. My intentions were clear n not meant to disrespect the press. Its a tone you speak within friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X