twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కిక్ శ్యామ్ అరెస్ట్‌కు ముందు షాకింగ్ విషయాలు.. హీరో, హీరోయిన్లపై నిఘా.. సీసీటీవీ ఫుటేజ్‌పై నజర్

    |

    చెన్నైలో గ్యాంబ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తూ కిక్ శ్యామ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కోలీవుడ్‌లో సంచలనం రేపింది. ఈ ఘటనలో శ్యామ్‌తోపాటు దాదాపు 13 మందిని అరెస్ట్ చేయడంతో గ్లాబ్లింగ్‌ ముఠా గుట్టును చెన్నై పోలీసులు రట్టు చేశారు. అయితే ఈ అరెస్ట్ తర్వాత పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు దృష్టికి రావడంతో పోలీసులు కొరడా ఝలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కిక్ శ్యామ్ అరెస్ట్ తర్వాత చోటుచేసుకొన్న విషయాలు ఏమిటంటే..

    కిక్ శ్యామ్ సెంటర్‌పై దాడికి ముందు

    కిక్ శ్యామ్ సెంటర్‌పై దాడికి ముందు

    కిక్ శ్యామ్ అరెస్ట్‌కు ముందు చెన్నై పోలీసులు భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైలో ఓ విద్యార్థి ఆన్‌లైన్ గేమ్‌ల వ్యసనానికి గురై ఆత్మహత్య చేసుకోవడం పోలీసుల దృష్టికి వచ్చింది. తాను పనిచేసే ఆఫీస్ నుంచి 20 వేల రూపాయలు తీసుకొని జూదంలో పోగొట్టుకోవడం, ఆ తర్వాత డిప్రెషన్‌కు గురై సూసైడ్ చేసుకోవడం అందర్నీ కలిచి వేసింది. దాంతో పోలీసులు గ్యాంబ్లింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.

    యువత జూదానికి ఆకర్షితులవుతున్నారని

    యువత జూదానికి ఆకర్షితులవుతున్నారని

    అంతకు ముందు యువత ఆన్‌లైన్ గేమింగ్, గ్లాంబ్లింగ్‌ బారిన పడుతున్నారనే ఉద్దేశంతో వాటిపై మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బ్రాంచ్‌ నిషేధం విధించింది. ఇలాంటి ఆటలు కొన్ని కుటుంబాలకు ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    ఆన్‌లైన్ గేమింగ్, గ్యాబ్లింగ్‌పై నిషేధం

    ఆన్‌లైన్ గేమింగ్, గ్యాబ్లింగ్‌పై నిషేధం

    గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన ఆటలకు సంబంధించిన జాబితాను జస్టిస్ పుహలేంది పోలీసులకు అందజేశారు. రమ్మీప్యాషన్, నజరా, లియోవెగాస్, స్పార్టాన్ పోకర్, ఏస్2త్రీ, పోకర్ దంగల్, పాకెట్ 52 లాంటి ఆన్‌లైన్ ఆటలపై నిషేధించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా పరిశీలించాలని సూచించారు.

    ఓ నటుడికి 10 లక్షలు నష్టం

    ఓ నటుడికి 10 లక్షలు నష్టం


    ఇలాంటి పరిస్థితుల్లో శ్యామ్ నిర్వహించిన గ్యాబ్లింగ్ సెంటర్లో ఓ నటుడు రూ.10 లక్షలు పొగొట్టుకోవడం, ఆ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ గ్యాబ్లింగ్ ముఠా వెనుక, నటుడు శ్యామ్ వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై దృష్టిపెట్టారు.

    Recommended Video

    నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్ వెనుక కొత్త ట్విస్టు.. స్టార్ హీరోలు, బడాబాబులు..! || Oneindia Telugu
    ఇతర హీరో, హీరోయిన్లపై గురించి సీసీటీవీలపై పోలీసుల నజర్

    ఇతర హీరో, హీరోయిన్లపై గురించి సీసీటీవీలపై పోలీసుల నజర్

    లాక్‌డౌన్ సమయంలో శ్యామ్ నిర్వహించిన బెట్టింగ్ కేంద్రానికి భారీగా స్టార్ హీరోలు, హీరోయిన్లు వచ్చినట్టు తెలుస్తున్నది. పలువురు పారిశ్రామిక వేత్తలకు కూడా ఉన్నట్టు సమాచారం. వారి గుట్టు లాగేందుకు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరూ ఉన్నారనే విషయంపై పోలీసుల దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది.

    English summary
    Kick actor Shaam arrested in Gambling case at at Nungambakkam of chennai. Chennai police conducted raids at an apartment of Shaam. Reports suggested that Game boards, tokens and lakhs of money which was involved in the game seized by police.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X