కిడ్నాప్ కాదది...వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని తేలింది
చెన్నై: తమిళ నటి అభినిత కిడ్నాప్‌కు గురైనట్లు తొలుత ఫిర్యాదు చేసిన ఆమె తల్లిదండ్రులు పోలీసులు జోక్యంతో ఆ కేసును ఉపసంహరించుకున్నారు. 'కట్రవై కట్రపిన్' తదితర సుమారు పది సినిమాల్లో నటించిన అభినిత కిడ్నాప్‌కు గురైనట్లు తొలుత ఆమె కుటుంబ సభ్యులు వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆ మేరకు వారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. విచారణలో ఆమె పట్టుకోట్టె ప్రాంతానికి చెందిన సినీ సహాయనటుడు మహేశ్(28)ను పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అతనితో కలిసి పట్టుకోట్టెలో ఉన్నట్లు తెలిసి వారితో పోలీసులు సంప్రదింపులు జరిపారు. విషయాన్ని అభినిత తల్లిదండ్రులకు తెలియజేశారు.

ఈ పెళ్లికి ఒప్పుకోని ఆమె తల్లిదండ్రులు మహేశ్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఇరు వర్గాలతో చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. దీంతో అభినిత తల్లిదండ్రులు మహేశ్‌పై కేసును ఉపసంహరించుకోవడంతో కథా సుఖాంతమైంది.


Click it and Unblock the Notifications











