కింగ్డమ్‌పై తమిళుల కన్నెర్ర.. విజయ్ మూవీపై చెన్నైలో నిరసన, పోస్టర్లు చించి ఆందోళన!

రౌడీ స్టార్ విజయ్ దేవర కొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన కింగ్డమ్ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ఈ సినిమాపై తమిళ ఉద్యమ, రాజకీయ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో తమిళుల మనోభావాలను దెబ్బ తీసేలా సన్నివేశాలు చిత్రీకరించారు, డైలాగ్స్ చెప్పించారనే ఆరోపణలపై ఈ సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ధర్నాకు దిగారు. పలు థియేటర్ల వద్ద పోస్టర్లను చించి వేసి ఆందోళనకు దిగారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కింగ్డమ్ కథేంటి?
కింగ్డమ్ సినిమా కథ విషయానికి వస్తే.. నిజమాబాద్‌లోని అంకాపూర్ గ్రామానికి చెందిన శివ అనే బాలుడు.. తన తల్లికి పెడుతున్న హింసను భరించలేక తండ్రిని హత మార్చి ఆ ఊరి నుంచి పారిపోతాడు. శివకు సోదరుడైన సూరి తన అన్న ఆచూకీ కోసం గాలింపు చేస్తుంటాడు. అయితే శ్రీలంకలో ఈ ముఠాకు నాయకుడైన శివను కలిసే అవకాశం కానిస్టేబుల్ అయిన సూరికి ఓ స్పెషల్ ఆపరేషన్ ద్వారా వస్తుంది. అయితే శ్రీలంకలో స్థానిక గ్రూపుకు, వలస వెళ్లిన గ్రూపుకు మధ్య వివాదం కొనసాగుతుంటుంది. స్పెషల్ ఆపరేషన్‌పై వెళ్లిన సూరి వలసవాదుల గ్రూపుకు నాయకుడు అవుతాడు. తన సోదరుడు శివ ఏమయ్యాడు? స్థానికంగా రెండు గ్రూపుల మధ్య వైరం ఏమిటనేది సినిమా కథ.

Kingdom Movie faces Ban ire

తమిళంలో సక్సెస్‌ఫుల్‌గా
అయితే తమిళ వెర్షన్‌లో కింగ్డమ్ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు భారీ స్పందన రావడంతో కలెక్షన్లు కూడా బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా నమోదు అయ్యాయి. తమిళంలో ఈ చిత్రం గత 5 రోజుల్లో 3.4 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు, సుమారుగా 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు అంతా సానుకూలంగా పరిస్థితి ఉన్న సమయంలో ఒక్కసారిగా ప్రతికూలత పరిస్థితులు చోటు చేసుకొంటున్నాయి.

తమిళుల నిరసన ఎందుకంటే?
అయితే కింగ్డమ్ సినిమాలోని తమిళ ఈలం గ్రూపును తప్పుడు రీతిలో చూపించారు. ఈ సినిమాలో పాత్రలు, కంటెంట్‌ వల్ల తమిళుల మనోభావాలు దెబ్బ తీశారు అంటూ నామ్ తమిజార్ కచ్చి సంస్థకు చెందిన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారి నిరసనను థియేటర్ల వద్ద కొనసాగిస్తున్నారు. ఈ సినిమా ప్రదర్శనను వెంటనే ఆపివేయాలని డిమాండ్‌ చేయడం వివాదంగా మారింది.

పోస్టర్లు చించి నిషేధించాలనే డిమాండ్
కింగ్డమ్ సినిమాను ప్రదర్శిస్తున్న జగన్ థియేటర్ వద్ద నిరసనకారులు ఆందోళన చేపట్టారు. థియేటర్‌ వద్ద పెట్టిన పోస్టర్లను చించి వేశారు. ఫ్లెక్సీలను తొలగించారు. ఈ సంఘటన రామంతపురం జగన్ థియేటర్ వద్ద చోటు చేసుకోవడంతో వివాదంగా మారింది. అయితే ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: Kingdom vijay deverakonda chennai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X