నా చేయి పట్టుకో, నీ ప్రపంచానికి తీసుకుపో అంటూ ముదురు భామ మెసేజ్... ఎవరికబ్బా?

నటి కిరణ్ రాథోడ్ తెలుగువారందరికీ పరిచయమే. తెలుగులో సిద్ధూ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించినా ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ భామ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

రవీనా టాండన్ బంధువు కావడంతో

రవీనా టాండన్ బంధువు కావడంతో

రాజస్థాన్ జైపూర్ లో జన్మించిన కిరణ్ రాథోడ్ పెరిగింది మాత్రం ముంబైలోనే. సినిమాల మీద ఆసక్తితో తన కాలేజీ చదువు పూర్తయిన వెంటనే ఈ భామ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. అప్పటికే ఓకే తన సమీప బంధువు రవీనా టాండన్ హిందీ సినిమాల్లో నటిస్తుండటంతో ఈమెకు త్వరగానే అవకాశాలు దక్కాయి. అయితే కాలేజ్ పూర్తికాగానే ముందుగా మోడలింగ్ ప్రారంభించిన ఈ భామ ఆ తర్వాత కొన్ని హిందీ పాప్ ఆల్బమ్స్ కి కూడా పనిచేసింది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా

అసిస్టెంట్ డైరెక్టర్ గా

హిందీలో బాల బ్రహ్మచారి అనే ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కిరణ్ తర్వాత 2 మ్యూజిక్ వీడియో లకు కూడా పనిచేసింది. తర్వాత సిద్ధూ అనే సినిమాతో తెరంగ్రేటం చేసి అదే ఏడాది యాదే అనే హిందీ సినిమాలో కూడా కనిపించింది. కానీ హిందీలో అవకాశాలు దక్కలేదు గాని తెలుగులో వరుస అవకాశాలు దక్కాయి. శుభకార్యం, నువ్వు లేక నేను లేను అనే సినిమాలో నటించిన తర్వాత జెమిని అనే సినిమా ద్వారా తమిళం ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో వరుస సినిమాలు

తెలుగులో వరుస సినిమాలు

తర్వాత తెలుగులో శ్రీరామ్, అందరూ దొంగలే దొరికితే, చెప్పవే చిరుగాలి, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, హై స్కూల్ లాంటి సినిమాల్లో నటించిన ఆమె చివరిగా తెలుగులో కెవ్వు కేక అనే సినిమాలో నటించింది. అయితే తెలుగులో ఎంత బాగా అవకాశాలు దక్కాయో తమిళంలో దానికి డబుల్ అవకాశాలు దక్కాయని చెప్పవచ్చు. దీంతో ఒకరకంగా ఈ భామ ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయింది. తెలుగులో సినిమాలు ఆపేసినా సరే తమిళంలో మాత్రం ఏడాదికి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంది.

యాప్ ఒకటి లాంచ్ చేసి మరీ

యాప్ ఒకటి లాంచ్ చేసి మరీ

అయితే సినిమా అవకాశాలు కాస్త తగ్గడంతో సొంతంగా ఒక యాప్ లాంచ్ చేసి దాని ద్వారా హాట్ ఫోటోలు అమ్మకానికి పెట్టి బాగానే సంపాదిస్తోంది. ఈ మధ్య బాగా ఒళ్లు చేసిన ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు వీడియోలు పెడుతూ యూత్ ని ఆకర్షించే పనిలో పడింది. తద్వారా తన యాప్ కి మరింత ట్రాఫిక్ పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.

Recommended Video

Aamir Khan and Kiran Rao announce divorce, to remain friends and co-parents
ఎవరికి హింట్ ఇస్తోందో?

ఎవరికి హింట్ ఇస్తోందో?

అయితే తాజాగా ఈ భామ ఒక ఫోటో షేర్ చేసి దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హాట్ గా ఉన్న ఒక ఫోటో షేర్ చేసి వెనక్కి చేయి చాపి ''నా చేతిని పట్టుకో, నన్ను నీ ప్రపంచానికి తీసుకు పో'' అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ భామ ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేసింది ? ఎవరికైనా ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తోందా ? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు కుర్రకారు. మరి ఆమె ఎవరికీ ఇండైరెక్ట్ మెసేజ్ చేసిందో లేక సరదాగా కామెంట్ పెట్టిందో ఆమెకే తెలియాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X