కాన్సర్ మందుల రేట్లపై కోర్టుకెక్కిన గాయకుడు జేసుదాస్
క్యాన్సర్ మందుల ధరలను తగ్గించాలని కేజే ఏసుదాస్ కేరళ కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారన్న సంగతి తెలిసిందే. ఈ కేసుఇంకా ఓ కొలిక్కి రాలేదు.ఈ విషయాన్ని ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ కుమారుడు ప్రస్దావిస్తూ...ఎంతో మంది క్యాన్సర్ బాధిత పేద ప్రజలు మందులు కొనలేక సతమతమవుతున్నారు. వారందరికి మందులు అందుబాటులోకి రావాలన్నదే నాన్న కోరిక. అందుకోసం ఆయన ప్రయత్నం కొనసాగుతోంది. త్వరలో కేరళ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం అన్నారు. ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్ ఈరోజు( సోమవారం) జన్మదినం జరుపుకుంటున్నారు. సంగీత సాధన మాత్రమే కాక సమాజసేవలోనూ ఆయన మునిగితేలుతున్నారు.పేద హృద్రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించడం కోసం గత ఏడాది నాన్నగారు శ్రీకారం చుట్టారు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే హృదయతాళం ఆర్గనైజేషన్. దీనిద్వారా ఇప్పటి వరకు 300 మందికి హృద్రోగ శస్త్రచికిత్సలు చేయించారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఇందుకు నిధులు సేకరిస్తున్నారు. జేసుదాస్, ఆయన కుమారుడు, అతని స్నేహితులు కలసి ఈ ఆర్గనైజేషన్ ని నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











