twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తలైవాకు ఎదురుదెబ్బ.. రజనీ కుటుంబానికి సుప్రీం షాక్

    By Rajababu
    |

    కొచ్చడయాన్ వివాదం సూపర్‌స్టార్ రజనీకాంత్ కుటుంబాన్ని ఇంకా వెంటాడుతున్నది. యాడ్ బ్యూరో కంపెనీకి బాకీ ఉన్న మొత్తాన్ని చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 12 వారాల లోపు చెల్లించాలంటూ తన ఆదేశాల్లో సుప్రీంకోర్టు పేర్కొనడం రజనీ కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. కొచ్చడయాన్ మూవీ హక్కుల అమ్మకాల విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

     బకాయిలు చెల్లించండి

    బకాయిలు చెల్లించండి

    కొచ్చడయాన్ హక్కుల అమ్మకానికి సంబంధించి కొంత మొత్తం విషయంలో వివాదం రజనీ కుటుంబం, యాడ్ బ్యూరో కంపెనీ మధ్య గొడవ జరిగింది. యాడ్ బ్యూర్, మీడియా గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్, లతా రజనీకాంత్ మధ్య వివాదం నెలకొన్నది. ఈ విషయంలో సదరు కంపెనీ కోర్టును ఆశ్రయిచింది. ఈ విషయంలో రూ.6.20 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

     కొచ్చడయాన్ వివాదం ఇలా..

    కొచ్చడయాన్ వివాదం ఇలా..

    కోచ్చడయాన్ సినిమా పూర్తికావడానికి సహకరించాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడానికి 10 కోట్లు చెల్లించాం. అయితే హక్కులను తమకే ఇస్తామని ఒప్పందం జరిగింది. అయితే రజనీ కుటుంబానికి చెందిన మీడియా వన్ సినిమా హక్కులను తమిళనాడు డిస్టిబ్యూషన్ హక్కులను ఎరోస్ ఇంటర్నేషనల్ అమ్మారు.

     రజనీ భార్యకు నోటీసులు

    రజనీ భార్యకు నోటీసులు

    తమను సంప్రదించకుండానే కొచ్చడయాన్ హక్కులను అమ్మివేశారు అని యాడ్ బ్యూరో కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో రజనీ సతీమణి లతకు 2016 జూలైలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

    Recommended Video

    Rajini 'Kaala' Breaks kabali Records దీంతో రజనీ టాప్ లేపడం ఖాయం..
     రజనీకాంత్‌పై ప్రభావం

    రజనీకాంత్‌పై ప్రభావం

    కొచ్చడయాన్ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్డు తీర్పు రజనీకాంత్‌కు ఎదురదెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నందున ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తున్నది.

    English summary
    The Kochadaiiyaan controversy is still haunting the Rajinikanth family. On Tuesday, the Supreme Court issued a directive asking Thalaiva’s wife Latha Rajinikanth to pay Rs 6.20 crores. The apex court has given a deadline of 12 weeks, within which Latha is bound to pay the sum to a company called Ad Bureau Co.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X