రజనీ ‘కొచ్చాడయాన్’ అఫీషియల్ టీజర్(వీడియో)

By Bojja Kumar

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన 'కొచ్చాడయాన్' చిత్రం అఫీషియల్ టీజర్ వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేసారు. రజనీ కూతురు సౌందర్య సౌందర్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ లుల్లా, సునందా మురళి మనోహర్, మురళి మనోహర్ నిర్మాతలు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు.

దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని 'విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తున్నారు.

ఈ చిత్రంలో రజనీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనె నటిస్తోంది. ఆమె మాట్లాడుతూ 'కొచ్చాడయాన్' కేవలం తమిళ సినిమా కాదని, అంతర్జాతీయ చిత్రం అని వ్యాఖ్యానించారు ఆచిత్ర హీరోయిన్ దీపిక పదుకొనె. దేశీయ బాషలైన హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్, రష్య, జపాన్, చైనా బాషలలో విడుదలవుతుందని, రజనీకాంత్ అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటుడని ఆమె చెప్పుకొచ్చారు. 3డిలో రూపొందుతున్న ఈచిత్రం యానిమేషన్, గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్‌లా ఉంటుందని దీపిక తెలిపారు.

శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X