twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొచ్చాడయాన్ తమిళ సినిమా కాదు : దీపిక

    By Bojja Kumar
    |

    రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కొచ్చాడయాన్' తమిళ సినిమా కాదని, అంతర్జాతీయ చిత్రం అని వ్యాఖ్యానించారు ఆచిత్ర హీరోయిన్ దీపిక పదుకొనె. దేశీయ బాషలైన హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్, రష్య, జపాన్, చైనా బాషలలో విడుదలవుతుందని, రజనీకాంత్ అంతర్జాతీయ గుర్తింపు ఉన్న నటుడని ఆమె చెప్పుకొచ్చారు. 3డిలో రూపొందుతున్న ఈచిత్రం యానిమేషన్, గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్‌లా ఉంటుందని దీపిక తెలిపారు.

    షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు.

    దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని 'విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తున్నారు.

    శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

    English summary
    Bollywood actress Deepika Padukone says her next Tamil film Kochadaiyaan is an international project as it will be released in multiple languages like Russian, Japanese and Chinese. The Chennai Express star will be seen with superstar Rajinikanth in Kochadaiyaan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X