నత్తనడకన రజనీ ‘కొచ్చాడయాన్’ పనులు
చెన్నై : రజనీకాంత్ హీరోగా 'కొచ్చాడయాన్' చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె హీరోయిన్.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. తెలుగులో ఈచిత్రాన్ని 'విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తున్నారు.
శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











