twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బెదిరింపే...ఆవిడ మోసం చెయ్యలేదంటూ ప్రకటన

    By Srikanya
    |

    చెన్నై : రజనీకాంత్ ‘కోచ్చడయాన్‌' చిత్రానికి సంబంధించిన నగదు వ్యవహారాల్లో లతా రజనీకాంత్‌ ఎప్పుడూ కల్పించుకోలేదని ఆ చిత్ర నిర్మాత మురళీ మనోహర్‌ స్పష్టం చేశారు. రూ.10 కోట్లు ఆమె మోసం చేశారన్న ఫిర్యాదులో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.

    ‘కోచ్చడయాన్‌' చిత్రం డిస్టిబ్యూటర్‌ హక్కుల వ్యవహారంలో లతా రజనీకాంత్‌ రూ.10 కోట్లు మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ యాడ్‌ బ్యూరో సంస్థ నిర్వాహకుడు అబీర్‌చంద్‌ చెన్నై పోలీసు కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ‘కోచ్చడయాన్‌' చిత్ర నిర్మాత మురళీ మనోహర్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

    రజనీకాంత్ ‘కొచ్చాడయాన్' బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఈ యానిమేషన్ మూవీ రజనీకాంత్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతూ వెంటాడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రజనీకాంత్ భార్యపై చీటింగ్ కేసు నమోదైంది.

    Kochadaiyaan producer on Latha Rajinikanth cheating

    ‘కొచ్చాడయాన్' చిత్రానికి సంబంధించి తమిళనాడు రైట్స్ విషయంలో రజనీకాంత్ వైప్ లత, నిర్మాత జె.మురళీమనోహర్ తమను మోసం చేసారంటూ ఎడి బ్యూరో అడ్వర్టెజింగ్ ప్రై.లి వారు చెన్నై సిటీ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేసారు. రూ. 10 కోట్లకు తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తమకు ఇస్తామని అగ్రిమెంటు చేసుకుని మోసం చేసారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

    మీడియా వన్‌ సంస్థ ‘కోచ్చడయాన్‌' చిత్రం విడుదలకు ముందు యాడ్‌ బ్యూరో అడ్వర్టైజింగ్‌ సంస్థ నుంచి రూ.33 కోట్లు రుణం కావాలని కోరగా, యాడ్‌ బ్యూరో సంస్థ కేవలం రూ.10 కోట్లు మాత్రమే ఏర్పాటు చేసిందన్నారు. ఈ కారణంగానే చిత్రం విడుదల చేయడంలో జాప్యం నెలకొందన్నారు. ఈ వ్యవహారంలో లతా రజనీకాంత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

    ఈ డబ్బుకు సంబంధించిన చెక్కులలో కానీ, పూచీకత్తు పత్రాలలో కానీ లతా రజనీకాంత్‌ ఎలాంటి సంతకాలు చేయలేదన్నారు. అయితే యాడ్‌ బ్యూరో సంస్థ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడేందుకే ఆమెపై ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారాన్ని చట్టరీత్యా తేల్చుకుంటామని నిర్మాత స్పష్టం చేశారు.

    ‘కొచ్చాడయాన్' తమిళనాడు లీజ్ రైట్స్ సదరు ఏజెన్సీకి నిర్మాత మురళి మనోహర్ అమ్మారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటుకు లతా రజనీకాంత్ గ్యారంటీ ఇచ్చారు. అయితే హక్కులు తమకు ఇవ్వకుండా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మారంటూ సదరు కంప్లైంటులో ఫిర్యాదు దారు అబిర్చంద్ నిరహార్ పేర్కొన్నారు.

    ఇదే సంస్థ లింగా చిత్రం హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొచ్చాడయాన్ దర్శకురాలైన సౌందర్య రజనీకాంత్అశ్విన్ తర్వాత ఈరోస్ సంస్థకు సీఈఓ అయ్యారని, ఒక ప్లాన్ ప్రకారం ఈ వైట్ కాలర్ మోస జరిగిందని పిర్యాదు దారు తన కంప్లైంటులో ఆరోపించారు. మొత్తానికి ఈ కేసు విషయం అటు పరిశ్రమ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది.

    English summary
    Kochadaiyaan producer revealed that Latha Rajinikanth been harassed in Kochadaiyaan issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X