రజనీకాంత్ ఫ్యామిలీని వెంటాడుతోంది: భార్యపై ఫ్రాడ్ !

By Bojja Kumar

హైదరాబాద్: రజనీకాంత్ ‘కొచ్చాడయాన్' బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఈ యానిమేషన్ మూవీ రజనీకాంత్ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతూ వెంటాడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రజనీకాంత్ భార్యపై చీటింగ్ కేసు నమోదైంది.

‘కొచ్చాడయాన్' చిత్రానికి సంబంధించి తమిళనాడు రైట్స్ విషయంలో రజనీకాంత్ వైప్ లత, నిర్మాత జె.మురళీమనోహర్ తమను మోసం చేసారంటూ ఎడి బ్యూరో అడ్వర్టెజింగ్ ప్రై.లి వారు చెన్నై సిటీ సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు చేసారు. రూ. 10 కోట్లకు తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తమకు ఇస్తామని అగ్రిమెంటు చేసుకుని మోసం చేసారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Kochadaiyaan still haunting Rajinikanth's family, wife faces fraud charge

‘కొచ్చాడయాన్' తమిళనాడు లీజ్ రైట్స్ సదరు ఏజెన్సీకి నిర్మాత మురళి మనోహర్ అమ్మారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన అగ్రిమెంటుకు లతా రజనీకాంత్ గ్యారంటీ ఇచ్చారు. అయితే హక్కులు తమకు ఇవ్వకుండా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అమ్మారంటూ సదరు కంప్లైంటులో ఫిర్యాదు దారు అబిర్చంద్ నిరహార్ పేర్కొన్నారు. ఇదే సంస్థ లింగా చిత్రం హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కొచ్చాడయాన్ దర్శకురాలైన సౌందర్య రజనీకాంత్అశ్విన్ తర్వాత ఈరోస్ సంస్థకు సీఈఓ అయ్యారని, ఒక ప్లాన్ ప్రకారం ఈ వైట్ కాలర్ మోస జరిగిందని పిర్యాదు దారు తన కంప్లైంటులో ఆరోపించారు. మొత్తానికి ఈ కేసు విషయం అటు పరిశ్రమ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో హాట్ టాపిక్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X