రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’ లేటెస్ట్ డీటేల్స్
సూపర్ రజనీకాంత్ హీరోగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'కొచ్చాడయాన్' చిత్రం తొలి షెడ్యూల్ లండన్‌లో సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది. తాజాగా కేరళలో రెండో షెడ్యూల్ ప్రారంభం అయింది. దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఈచిత్రంలో రజనీకాంత్ సరసన దీపిక పడుకొనె నటిస్తోంది.
దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య డైరెక్ట్ చేస్తుండగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నాడు. రోబో తర్వాత రజనీ 'రాణా' చిత్రాన్ని మొదలు పెట్టారు. ఆ చిత్రం ప్రారంభోత్సవం రోజు ఆయన అనారోగ్యానికి గురి కావడం సినిమా అటకెక్కింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత రజనీ మళ్లీ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' సినిమా చేస్తున్నారు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే 'ఖడ్గ రుద్ర' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ తారాగణమైన ఈ సినిమాకి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో తయారవుతున్న ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాని లక్ష్మీగణపతి ఫిలిమ్స్ పతాకంపై సుబ్రమణ్యం బి. అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











