రజనీ అల్లుడి పాటకు 4 మిలయన్ల నొక్కులు
సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ వెండి తెరపైనే కాదు..ఇంటర్నెట్ లోనూ సంచలనం సృష్టిస్తున్నాడు. తన తాజా సినిమా '3" కోసం స్వయంగా పాటను రాయడమే కాదు, అద్భుతంగా పాడాడు ధునుష్. ఆయన పాడిన 'కొలవెరి" పాట ఇప్పుడు ఇంటర్నెట్ లో యమ స్పీడుగా దూసుకెలుతోంది. దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి 10 రోజులైనా కాలేదు అప్పడే 40 లక్షల నొక్కులు(క్లిక్స్) పడ్డాయి. ఇక సినిమా విడుదలయ్యేలోపు ఈ సంఖ్య కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
'మయక్కమ్ ఎన్న" చిత్రానికిగాను మూడు పాటలను స్వయంగా రచించిన ధనుష్ విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా తన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న '3" అనే సినిమాలో హీరోగా నటించడంతో పాటు పాటలు కూడా రాశాడు. వీటిలో 'వై దిస్ కొలవెరిది" అనే పాటను స్వయంగా పాడి మార్కెట్ లోకి వదిలాడు. ఈ పాటకు తమిళ జనాల నుంచే కాకుండా దేశ వ్యాప్తంగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ కూడా మెచ్చుకున్నారంటే పాట ఏం రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











