twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చరిత్ర సృష్టించిన ‘కొలవెరి డి’

    By Bojja Kumar
    |

    ధనుష్, శృతి హాసన్ నటించిన '3' సినిమా ఫట్టయినా......ఆ చిత్రంలోని 'కొలవెరి డి' పాట మాత్రం భారతీయ మ్యూజిక్ చరిత్రలోనే మెగా హిట్ గా నిలిచింది. 50 మిలియన్ల(5 కోట్లు) హిట్స్ సంపాదించిన తొలి సాంగుగా రికార్డుల కెక్కింది. తాజాగా ఈ పాట గోవా‌ఫెస్ట్ 2012లో రెండు అవార్డులు సొంతం చేసుకుంది.

    ఇప్పటికే ఈ పాట టైమ్స్ మ్యాగజైన్ పై కూడా చోటు దక్కించుకుంది. నిన్నటి వరకు ధనుష్ ఒక్క తమిళనాడుకే పరిమితం. ఈ పాట పుణ్యమా అని ధనుష్ నేషనల్ స్టార్ గా మారి పోయాడు. అంతకు మించి అతను పాడిన 'వై దిస్ కొలవెరి డి' పాట దేశ వ్యాప్తంగా మారు మ్రోగి పోయింది. ఎల్లలు కూడా దాటి సీమాంతరం, ఖండాంతరం కూడా వ్యాపించింది. పిల్లల్ని, పెద్దల్ని ఆ పాట పట్టి లాగేసింది. ఎక్కడెక్కడో విహరింపజేసింది.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేసింది. అయస్కాంతంలా మన చెవుల్ని అటు వైపు ఆకర్షింప చేసింది..అందుకే కొలవెరి పాట చరిత్ర సృష్టించింది.

    అసలీ పాట పుట్టడమే గమ్మత్తుగా పుట్టింది. ఓ భగ్నప్రేమికుడు మందుకొడుతూ ఆ బాధను పాట రూపంలో వ్యక్తం చేయాలన్నది సందర్భం. దర్శకురాలు ఐశ్వర్య ఈ సందర్భాన్ని చెప్పి పాటను వెరైటీగా చేయమంది. సంగీత దర్శకుడు ఆనిరుద్ రవిచంద్ర ట్యూన్ కట్టి ఇచ్చాడు. ధనుష్ అసలు ప్లానింగ్ అంటూ ఏమీ లేకుండా ఓ ఇరవై నిమిషాల్లో ఈ పాట రాసేశాడు.

    పదాలన్నీ TANGLISH లో వుంటాయి. అంటే తమిళం, ఇంగ్లిష్ మిక్సింగ్ అన్న మాట! తమిళులు తమ నిత్యజీవితంలో ఉపయోగించే ఇంగ్లిష్ పదాలే వాడాడు. పైగా తమిళ యాసలో ఆ ఇంగ్లిష్ ఉచ్చరిస్తాడు. అదే ఇక్కడ వెరైటీ అయింది! సాహిత్యపు విలువలేమీ లేకుండానే ఈ పాట ఇంతిలా హిట్ అవడం ఒక వింతే. అందుకేనేమో బాలీవుడ్ కవి జావేద్ అక్తర్ ఏముందిందులో? అంటూ పెదవి విరిచాడు. నిజమే... సాహిత్య గుబాళింపు లేదు. కానీ హిట్ అయింది... అదే వైచిత్రి!

    English summary
    Dhanush’s last release 3 might have ended as flop at both Tollywood and Kollywood box offices, but the song Kolaveri Di has been creating sensations. The song already reached a milestone of 50 million hits on YouTube. The song recently won two awards at the prominent Creative Abbys awards at The Goa fest 2012. The song has received Gold in the Direct category and a Silver in the Digital and Interactive category.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X