Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ ఆ బంతిని వదిలేయాల్సింది.. ఇన్ని తప్పులు ఎప్పుడూ చేసుండకపోవచ్చు: సెహ్వాగ్
- News
పీఎం కిసాన్ వద్దా..? సగ మందికి కూడా రావడం లేదు: రాములమ్మ ఫైర్
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vijay 66 - వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ లో పవర్ఫుల్ సీనియర్ హీరో.. స్పెషల్ రోల్ ఫిక్స్!
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వారిలో ప్రస్తుతం విజయ్ టాప్ లిస్టులో ఉన్నాడు అనే చెప్పాలి. విజయ్ ఏలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా వందకోట్ల కలెక్షన్స్ అందుకుంటున్నాయి. అయితే బీస్ట్ తప్పితే అంతకు ముందు వచ్చిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే అందుకున్నాయి. కానీ బీస్ట్ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ కూడా విజయ్ కొంచెం కూడా తగ్గలేదు అని చెప్పాలి. ఎందుకంటే అతనికి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే సోషల్ మీడియాలో అయితే ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
66వ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ కూడా ట్రెండింగ్ లిస్టులో చేరిపోతున్నాయి. ఇక విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 66వ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. గత ఏడాది నుంచి విజయ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నా దిల్ రాజుకు ఇప్పటికి అవకాశం దొరికింది. ఇక ఈ సినిమా కోసం విజయ్ కు అత్యధికంగా 100 కోట్ల పారితోషికం కూడా ఇస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు తమిళ చిత్ర పరిశ్రమలో అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకున్న హీరోగా విజయ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

అయితే విజయ్ వంశీ పైడిపల్లి సినిమాలో స్టార్ క్యాస్ట్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా రష్మిక మందన్నాను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే మరో సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు గా తెలుస్తోంది. శరత్ కుమార్ ఇంతకుముందే చాలామంది పెద్ద హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించి ఆ సినిమాల విజయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు.
ఇక ఇప్పుడు విజయ్ సినిమాలో ఆయన చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించ బోతున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఆ పాత్ర సినిమాలో చాలా హైలెట్గా నిలుస్తుంది అని కూడా అంటున్నారు. అంతే కాకుండా మరొక తమిళ నటుడు ప్రభు అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు చిత్రయూనిట్ తెలియజేసింది. బీస్ట్ సినిమా డిజాస్టర్ కావడంతో విజయ్ ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అనుకుంటున్నాడు.
తమిళనాడులోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్కెట్ పై మరోసారి పట్టు సాధించాలి అని చూస్తున్నాడు. ఇంతకు ముందు వచ్చిన విజయ్ సినిమాలు చాలా వరకు తెలుగులో మంచి వసూళ్లను సాధించాయి. ఇక ఇప్పుడు డైరెక్ట్ గా దిల్ రాజు వంటి ప్రముఖ తెలుగు నిర్మాత తో సినిమా చేయబోతున్నాడు కాబట్టి తెలుగులో మార్కెట్ స్థాయి పెరుగుతుంది అనే చెప్పాలి. దానికి తోడు కమర్షియల్ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కావున అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.