మరో వివాదంలో వనిత విజయకుమార్.. వీడియో బయటపెట్టిన నటుడు
గతంలో ఎప్పుడు లేని విధంగా తమిళ నటి వనిత విజయకుమార్ సౌత్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఓ వైపు మూడో పెళ్లికి సంబంధించిన వివాదాలతో సతమతమవుతుంటే మరోవైపు ఇతర నటీనటుల నుంచి కూడా ఆమె విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో గాని వనితను ఏ రకంగాను ఆమె శత్రువులు వదలడం లేదు. బీజేపీ పార్టీపై చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ కి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

మూడో పెళ్లిపై విమర్శలు
పీటర్ పాల్ అనే ఒక సినీ టెక్నీషియన్ ని ఇటీవల వనిత వివాహం చేసుకున్న విషయం విషయం తెలిసిందే. ఇద్దరి భర్తలకు విడాకులు ఇచ్చేసి, ఎదిగిన ఇద్దరు కూతుళ్లు ఉన్నా కూడా పెళ్లి చేసుకున్న వనితపై తమిళనాడులో విమర్శలు ఒక రేంజ్ లో వచ్చాయి. స్థానిక సంప్రదాయాలకు, కట్టుబాట్లకు ఎక్కువగా విలువ ఇచ్చే తమిళ ప్రజలు ఆమెపై సోషల్ మీడియాలో గట్టిగానే ట్రోల్ చేస్తున్నారు.

చిక్కుల్లో పడిన వనిత విజయకుమార్
ఇక పాల్ మొదటి భార్య ఎలిజాబెత్ తనకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లి ఎలా చేసుకుంటారు అని కోర్టును ఆశ్రయించడంతో వనిత చిక్కుల్లో పడింది. ఎలిజాబెత్ కి ఇతర నటీనటుల నుంచి కూడా మద్దతు లభించింది. సూర్యాదేవీ, లక్ష్మీ రామకృష్ణన్, కస్తూరీ శంకర్, నిర్మాత రవీంద్రన్ వంటి వారు కూడా ఈ వివాదంలోకి వచ్చారు.

రాజకీయ వివాదాల్లో కూడా
ఇక ఓ వైపు పోలీస్ కేసు మరోవైపు ఇండస్ట్రీ నుంచి విమర్శలకు గురవుతున్న వనిత ఇక ఇప్పుడు రాజకీయాలకు సంబంధించిన వివాదాల్లో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమెకు సంబంధించిన ఒక వీడియోను టీవీ యాక్టర్ నంజి విజయన్ వైరల్ అయ్యేలా చేశాడు. అందులో బీజేపీని వనిత ట్రోల్ చేస్తున్నట్లు ఉండడంతో విషయం మరింత వేడిగా మారుతోంది.
బీజేపీ పార్టీపై కూడా
తమిళనాడులో బీజేపీ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది అంటూ 10 మంది కూడా లేని ఆ పార్టీలో తన తండ్రి విజయకుమార్ కూడా బిజీగా ఉన్నారని ఆమె కామెంట్స్ చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. కేవలం తమిళనాడులోనే కాకుండా నేషనల్ మీడియాలో కూడా వనితకు సంబంధించిన వార్తలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నేషనల్ పార్టీపై ఆమె చేసిన కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











