విక్రమ్ కోబ్రా వేషాలు.. అపరిచితుడు లాంటి హిట్టు కొడతాడట!
చియాన్ విక్రమ్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. ప్రయోగాత్మక పాత్రలకు మరో రూపంలా తనకాంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. పాత్ర కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టగల ఈ స్టార్ యాక్టర్ ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో తెగ హడావుడి చేసేవాడు. తెలుగులో కూడా విక్రమ్ కొన్ని డబ్బింగ్ సినిమాలతో మంచి కలెక్షన్స్ అందుకున్నాడు. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు ఈ టాలెంటెడ్ హీరో సక్సెస్ లు అందుకోవడం లేదు.
తెలుగులో అయితే అపరిచితుడు తరువాత సక్సెస్ అందుకున్నది లేదు. నటనపరంగా ఎన్నో ప్రయోగాలు చేసి సినిమాలకు హైప్ క్రియేట్ చేస్తున్నాడు గాని బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ అందుకోవడం లేదు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో కోబ్రా అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ తో రానున్నాడు. ఆ సినిమాలో పలు రకాల డిఫరెంట్ పాత్రలతో మెప్పించనున్నాడట. ఆ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. అజయ్ జ్ఞానముత్తు అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. వరుస అపజయలతో సతమతమైన విక్రమ్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి తెలుగులో అపరిచితుడు లాంటి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











