కరోనా ఎఫెక్ట్.. నిద్ర మాత్రలు మింగిన సీనియర్ నటి మనోరమ కుమారుడు
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరు ఊహించని విధంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్థికవ్యవస్థతో పాటు ఉపాధి లేక ఎన్నో లక్షల కుటుంబాలు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఇకపోతే మద్యం లేక మరికొంత మంది మందుబాబులు కూడా పిచ్చేక్కిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే మద్యం లేనందుకు చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మనోరమ కుమారుడు ఆత్మహత్యాయత్నం..
దివంగత సీనియర్ నటి మనోరమ కుమారుడు కూడా ఇటీవల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. మనోరమ కుమారుడు భూపతికి మద్యం అలవాటు ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా మద్యం షాపులు కూడా మూసివేయడంతో భూపతి పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇక రీసెంట్ గా భూపతి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

మద్యానికి బానిసై..
భూపతి తల్లి మనోరమ మరణం తరువాత కొంత మానసిక ఒత్తిడికి లోనయ్యారు. అంతకుముందే మద్యం అలవాటు ఉన్నప్పటికీ తల్లి మరణం తరువాత ఆ డోస్ మరింతగా పెంచాడట. మందు ముట్టనిదే నిద్రకుడా పోనీ భూపతి లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి మద్యం లేక మానసిక ఒత్తిడికి లోనయ్యారట. నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకోవడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు..
మనోరమ కుమారుడు మద్యం దొరక్క ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లు ఒక్కసారిగా తమిళ్ మీడియాలో కథనాలు వెలువడడంతో వారి కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మద్యం కోసం ఆయన ఆత్మహత్యకు పాల్పడలేదని నిద్రపట్టకపోవడంతో నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకున్నట్లు తెలిపారు.
Recommended Video

ఆస్పత్రిలో చిక్కిత్స పొందుతున్న భూపతి..
మత్తు కోసం భూపతి నిద్రమాత్రలు తీసుకోవడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇక రూమర్స్ పై మీడియాకు భూపతి కుమారుడు రాజరాజన్ వెంటనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక ప్రస్తుతం భూపతి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











