తమిళ నటి ఆత్మహత్య.. నా ప్రియుడే కారణం.. తల్లికి వాట్సప్ మెసెజ్
తమిళ సినీ, టెలివిజన్ నటి యషిక ఆత్మహత్య చేసుకోవడం కోలీవుడ్‌ను కుదిపేసింది. తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. తన మరణానికి కారణం తన ప్రియుడే అంటూ వాట్సప్ సందేశంలో పేర్కొన్నది. గత కొద్దికాలంగా సహజీవనం చేస్తున్న నటి ఆత్మహత్యకు పాల్పడటం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గత కొద్దికాలంగా ఇలాంటి సంఘటనలు తమిళ సినిమా రంగంలో ఎక్కువగానే చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నదంటూ సినీ వర్గాలు వ్యాఖ్యానించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే

వ్యాపారవేత్తతో సహజీవనం
నటి యాషిక అసలు పేరు మేరీ షీలా జెబరాని. గతంలో వడపళనిలోని ఓ హాస్టల్‌లో నివసించేంది. ఆ క్రమంలో పెరంబూరుకు చెందిన అరవింద్ అలియాస్ మోహన్‌బాబు అనే వ్యాపారవేత్తతో పరిచయం సహజీవనానికి దారి తీసింది. గత కొద్దికాలంగా వారిద్దరూ చెన్నైలోని పెరవల్లూర్‌లోని జీకేఎం కాలనీలో సహజీవనం చేస్తున్నట్టు సమాచారం.

సహజీవనంలో అభిప్రాయ భేదాలు
యషిక, మోహన్‌బాబు సహజీవనంలో అవాంతరాలు ఏర్పడ్డాయి. అభిప్రాయ బేధాలు తలెత్తడంతో వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మూడు రోజుల క్రితం జరిగిన ఓ గొడవతో యషిక మనస్తాపం చెందినట్టు తెలిసింది. దాంతో తన ప్రియుడిని ఇంటి నుంచి బయటకు పంపినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

నా ప్రియుడే మరణానికి కారణం
ప్రియుడి నుంచి వేధింపుల ఎక్కువడంతో యషిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన మరణానికి కారణం ప్రియుడే అని తన తల్లికి వాట్సప్‌లో సందేశాన్ని పంపారు. పెళ్లి చేసుకోకుండా మోసగించడం వల్లే ఈ దారుణానికి ఒడిగడుతున్నానని సందేశంలో పేర్కొన్నారు. తన మరణానికి కారణమైన మోహన్‌బాబుకు కఠిన శిక్ష పడేలా చేయాలని తల్లిని కోరారు.

చెన్నై పోలీసులు దర్యాప్తు
యషిక ఆత్మహత్య వార్త బయటకు పొక్కడంతో హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టు మార్టమ్‌కు పంపి విచారణ ప్రారంభిస్తున్నారు. పోస్టు మార్టమ్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకునే దిశగా పోలీసులు అడుగులేస్తున్నట్టు తెలిసింది.

సినిమా, టెలివిజన్ రంగంలో
తమిళనాడులోని తిరుప్పురుకు చెందని యషిక సినిమా రంగంలో రాణించాలని చెన్నైకి చేరుకొన్నారు. విమల్ హీరోగా నటించిన మన్నార్ వగైయారా చిత్రంలో నటించారు. ఆనంది లాంటి ఇతర సీరియల్స్‌లో నటించారు. యషిక మృతికి తమిళ సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.


Click it and Unblock the Notifications











