twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విమలా రామన్ పై బ్యాన్ నిర్ణయం

    By Srikanya
    |

    తెలుగులో జగపతిబాబు సరసన చాలా చిత్రాల్లో చేసిన విమలారామన్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామెపై బ్యాన్ పెట్టేందుకు తమిళ సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు నిర్మాతల మండలి చర్చించినట్లు సమాచారం. దానికి కారణం ఆమె నటించిన డ్యాం 999 అనే హాలీవుడ్ చిత్రం. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం తమిళుల మనోభావాల్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆందోళనలు వెల్లు వెత్తుతున్నాయి.ఎండీఎంకే, పీఎంకే వర్గాలు డ్యాం 999ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డీఎంకే ఎంపీలు బుధవారం పార్లమెంట్‌లో కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ డీఎంకే అధినేత కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు.

    ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన ముల్లై పెరియార్ డ్యాం మీద తమిళులకు పూర్తి హక్కు ఉందని తెలిపారు. ఈ హక్కుల్ని కాలరాయాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం డ్యాం 999ను నిర్మించినట్లు అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను ఈ చిత్రం దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముల్లై పెరి యార్ డ్యాం కట్టలు తెగితే భారీ నష్టం ఉంటుందని ఈ చిత్రంలో ఎత్తిచూపినట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ముల్లై పెరియార్ డ్యామ్‌ను కూల్చి వేయించాలన్న లక్ష్యంతోనే చిత్రాన్ని తీసినట్లుగా భావన కలుగుతోందని పేర్కొన్నారు.డ్యాం 999లో నటించిన నటి విమలారామన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలారామన్‌కు తమిళంలో అవకాశాలు ఇవ్వకూడదని, ఆమె నటించిన ఇతర భాషా చిత్రాల విడుదలను తమిళనాడులో అడ్డుకోవాలని కోలీవుడ్ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    English summary
    Vimala is worried as the film Dam 999 has already kicked up a huge controversy in Tamil Nadu as it's about the Mullai Periyar dam which Tamilians hold very sensitive to their hearts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X