మాస్టర్ కూడా సిద్ధమయ్యాడు.. అసలైన అప్డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు!
సౌత్ ఇండియాలో లాక్ డౌన్ అనంతరం విడుదల కాబోతున్న అతిపెద్ద సినిమాల్లో మాస్టర్ ఒకటి. కరెక్ట్ గా విడుదల కావాల్సిన టైమ్ లోనే లాక్ డౌన్ మొదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా వాయిదా పడి నెలలు గడుస్తున్నా కూడా ఇంకా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కేవలం తమిళ్ ఆడియెన్స్ అనే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా మాస్టర్ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు అలాగే టీజర్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ సరికొత్త లుక్ లో కనిపిస్తుండడం అలాగే ఖైదీ వంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న లోకేష్ కనగరాజన్ ఆ సినిమాను డైరెక్ట్ చేయడం వలన భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా విడుదలపై అలాగే ట్రైలర్ రిలీజ్ డేట్ పై రేపే క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మంగళవారం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ రానున్నట్లు చెప్పేశారు.

కటౌట్స్ తో పాటు సినిమా థియేటర్లు కూడా రెడీ చేసుకోవాలని ఒక స్పెషల్ విసియోను రిలీజ్ చేయడంతోనే అసలు మ్యాటర్ అర్ధమయ్యింది. తప్పకుండా రేపు మధ్యాహ్నం 12:30కి సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ ఉంటుందని అంటున్నారు. ఇక సినిమాను జనవరి13న రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ట్రైలర్ న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రిలీజ్ చేయవచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











