twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళనాట ఓట్ల పండగ: ఓటు వేసిన రజనీ, కమల్, విజయ్, సూర్య, కార్తి!

    |

    లోక్‌సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా దశలవారిగా జరుగుతున్నాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగ్గా గురువారం(ఏప్రిల్ 18) తమిళనాడులో పోలింగ్ నిర్వహించారు. పలవురు తమిళ సినీ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అభిమానులు ఓటు వేసేలా మోటివేట్ చేస్తున్నారు.

    రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి లాంటి టాప్ సినీ స్టార్లు సైతం సాధారణ ప్రజలతో కలిసి క్యూ లైన్లో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    ముంబై నుంచి చెన్నై వచ్చిన రజనీ

    ముంబై నుంచి చెన్నై వచ్చిన రజనీ

    ‘దర్బార్' సినిమా షూటింగులో భాగంగా ముంబైలో ఉన్న రజనీకాంత్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బుధవారం సాయంత్రమే చెన్నై చేరుకున్నారు. చెన్నైలోని స్టెల్లామేరీ కాలేజీలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.

    భార్య శాలినితో కలిసి అజిత్

    హీరో అజిత్ తన భార్య శాలినితో కలిసి చెన్నైలోని తిరువాన్మియూర్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. మరికొందరు సెలబ్రిటీలు సైతం విధిగా తమ ఓటు హక్కను వినియోగించుకోవడంతో పాటు అభిమానులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

    కూతురుతో కలిసి కమల్ హాసన్

    కూతురుతో కలిసి కమల్ హాసన్

    కమల్ హాసన్‌కు ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవి, ఆయన ‘మక్కల్ నీది మయ్యమ్' అనే పార్టీని స్థాపించిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికలు. 39 స్థానాల్లో ఆయన తన పార్టీ తరుపున అభ్యర్థులను బరిలో దించారు. తన కూతురు శృతి హాసన్‌తో కలిసి ఆల్వార్ పేటలోని పాఠశాలలో ఓటు వేశారు.

    సూర్య, కార్తి

    సూర్య, కార్తి

    శివ కుమార్ ఫ్యామిలీకి చెందిన స్టార్లు... హీరో సూర్య తన భార్య జ్యోతికతో, కార్తి తన భార్య రంజనితో కలిసి టి నగర్లోని పోలింగ్ బూత్‌లో ఓటు చేశారు. హీరో సిద్ధార్థ్, ఇతర తమిళ సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    విజయ్

    మరోస్టార్ విజయ్... చెన్నైలోని అడ్యార్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుష్భూ, రెహమాన్, అనిరుధ్ రవిచందర్, మీనా తదితరులు తమ ఓటు వేశారు.

    English summary
    Kollywood celebs Rajini, Kanal, Suriya, Karthi, Jyothika, Vijay cast their vote. Stars busy with the shooting of their upcoming movies, the stars took the break from their shoot to exercise their democratic rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X