విజయ్, మహేష్ బాబులకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.. హీరోయిన్ బూతులకు కమెడియన్ కౌంటర్
ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా కొంతమంది నటిమనులు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. అయితే అక్కడ స్టార్ హీరోలను తిడుతుంటే ఇతర నటీనటులు వెంటనే స్పందిస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తుంటే మరికొందరు ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తున్నారు. అదే తరహాలో సీనియర్ కమెడియన్ వివేక్ కూడా తనదైన శైలిలో మీరా మిథున్ కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ వస్తున్నాయి.

ఆమె బండారం బయటపెడతానంటూ..
కోలీవుడ్ బోల్డ్ హీరోయిన్ గా తనకంటూ ఒక కాంట్రవర్సీ క్రేజ్ అందుకున్న మీరా మిథున్ మొదట స్టార్ హీరోయిన్స్ ని టార్గెట్ చేసింది. ముఖ్యంగా త్రిష బండారం బయటపెడతాను అంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇక రీసెంట్ గా సూర్య, విజయ్ లాంటి స్టార్ హీరోలను కూడా ఆమె టార్గెట్ చేసిన విధానం విమర్శలపాలయ్యేలా చేస్తోంది.

హీరోలపై బండ బూతులు..
సూర్య, విజయ్ వారి అభిమానులను తనపై దాడి చేసేలా ప్రేరేపిస్తున్నారని కామెంట్ చేస్తూ బండ బూతులు తిట్టేసింది. ఆఖరికి హీరోల ఫ్యామిలీ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేయడంతో మీరా దూకుడుకు అభిమానుల చాలా సీరియస్ అయ్యారు. ఇక భారతిరాజా వంటి వారు కూడా కౌంటర్ ఇచ్చారు. రీసెంట్ గా తమిళ సీనియర్ కమెడియన్ వివేక్ ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మహేష్, విజయ్ లకు కోట్లాది మంది ఫ్యాన్స్
మహేష్ బాబు సార్ కి అలాగే మన విజయ్ సార్ కి కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. వారు ప్రకృతి కోసం మంచి పనులు చేస్తున్నారు. అలాగే వారి అభిమానులు వారి నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. అలాంటి మంచి విషయాలను మనం ప్రశంసించాలి. దయచేసి ఇతరులతో పోల్చకండి అంటూ ట్విట్టర్ లో స్పందించగా.. మీరా మిథున్ చేసిన కామెంట్స్ కి వివేక్ ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
Recommended Video

మీరా ఏ విధంగా స్పందిస్తుందో..
ఫైనల్ గా మన అల్టిమేట్ ఎయిమ్ అనేది భూమిని పచ్చగా ఉంచడమేనని వివేక్ ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తనపై ఎవరు కామెంట్ చేయకపోతేనే ఒక రేంజ్ లో విరుచుకుపడే మీరా మిథున్ ఇప్పుడు కమెడియన్ ఈ విధంగా ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేయడంతో ఏ విధంగా స్పందిస్తుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి.


Click it and Unblock the Notifications











