Suriya Jyothika Net Worth: సూర్య, జ్యోతికలకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?

కోలీవుడ్ క్యూట్ కపల్.. సూర్య, జ్యోతికల గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరు తమిళ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే అయినప్పటికీ తెలుగులోనూ పలు చిత్రాలు చేశారు. ముఖ్యంగా వారు తమిళంలో చేసిన అనేక సినిమా తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం గుర్తింపే కాదు.. పెద్ద ఎత్తున అభిమానులను కూడా సంపాధించుకున్నారు.

అయితే తాజాగా వీరి ఆస్తులకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా సూర్య, జ్యోతికలకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమో ఉన్నాయి, బంగ్లాలు, కార్లు, ఇత ఆస్తులతో పాటు వారిద్దరికీ ఎంత రెమ్యునరేషన్ వస్తుందో కూడా తెలిసిపోయింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kollywood Cute Couple Suriya Jyothika Net Worth Full Details

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ఆన భార్య జ్యోతిక గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టగా.. ప్రస్తుతం ఈ క్యూట్ కపల్ హాయిగా జీవిస్తోంది. అయితే చాలా రోజుల నుంచి జ్యోతిక తన భర్త సూర్యతో కాకుండా.. ముంబైలో ఉంటోంది. పిల్లలు ఇద్దరిని కూడా అక్కడే స్కూల్లో జాయిన్ చేసింది. దీని వల్లే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కానీ అవన్నీ ఫేక్ అని అతి త్వరగానే తెలిసిపోయింది. జ్యోతిక కెరియర్ కోసమే ముంబై షిఫ్ట్ కాగా.. అక్కడే ఓ ఇల్లు కొనుగోలు చేసింది. అయితే తన భర్త సూర్యతో కలిసే ఈ పని చేయగా.. వీరి ఆస్తులకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఇప్పిటి వరకు ఎంత కూడబెట్టారనే లెక్కలు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఈ జంట ముంబైలో కొనుగోలు చేసిన బంగ్లా విలువ 70 కోట్ల వరకూ ఉంటుందట.

Kollywood Cute Couple Suriya Jyothika Net Worth Full Details

అలాగే వీరిద్దరి నికర ఆస్తుల విలువ రూ.537 కోట్లు అని తెలుస్తోంది. ఇందులో సూర్య షేర్ రూ.206 కోట్లు కాగా... జ్యోతిక షేక్ రూ.331 కోట్లు అని సమాచారం. ముఖ్యంగా హీరో సూర్య ఒక్క సినిమా కోసం రూ.30 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. కంగువాలో నటించేందుకు ఆయన అక్షరాలా 30 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆయనకు ఓ బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్ ఉందట. దీని విలువు రూ.1.38కోట్లు. అలాగే 80 లక్షల రూపాయల విలువ చేసే ఆడీ క్యూ7, 6.91 లక్షల రూపాయల విలువ చేసే మెర్సీడెస్ బెంజ్, రూ.1.10 కోట్ల విలువ చేసే జగ్వార్ ఉందట.

ఇవన్నీ ఒకెత్తు కాగా... చెన్నైలో ఉన్న ఇల్లు.. 20 వేల చదరపు అడుగులు ఉంటుందని.. దీని విలువ కూడా చాలా ఎక్కువ అని సమాచారం. జ్యోతిక ఇటీవలే బాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వగా.. వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఆమె చేసిన షైతాన్ సినిమా 100 కోట్లకు చేరువైంది. మరోవైపు సూర్య కంగువా సినిమా చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X