twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Atlee Kumar: తండ్రి అయిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

    |

    ఇటీవల సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓవైపు విషాదాలు చోటు చేసుకుంటూనే మరోవైపు శుభవార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోయిన్ జమున, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మరణించగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, హన్సిక వాళ్లు ప్రేమించిన వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అలాగే మరో హీరో శర్వానంద్ నిశ్చితార్థం చేసుకోగా సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

    కన్నడ స్టార్స్ హరిప్రియ, వశిష్ట ఎన్ సింహా, సీనియర్ నటి సుమలత, దివంగత అంబరీష్ దంపతుల కుమారుడు, నటుడు అభిషేక్ అంబరీష్ ఎంగేజ్ మెంట్స్ కూడా జరిగాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా ఓ సినీ సెలబ్రిటీ జంట తల్లిదండ్రులు అయ్యారు.

    రాజా రాణి సినిమా ద్వారా..

    రాజా రాణి సినిమా ద్వారా..

    యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ గురించి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ సినిమా డైరెక్టర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద ఎంథిరన్ (2010) (రోబో), నన్బన్ (2012) (స్నేహితుడు) చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన అట్లీ రాజా రాణి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

    ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది. దీంతో అట్లీ పేరు తెలుగు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. ఈ సినిమాతో నూతన దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా మంచి పేరు సంపాదించుకున్నాడు అట్లీ.

    వరుసగా హాట్రిక్ కొట్టి..

    రాజా రాణి తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెరి (2016), మెర్సల్ (2017), బిగిల్ (2019) చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈ మూడు చిత్రాలు కూడా మంచి హిట్లు సాధించాయి. ఇలా వరుసగా విజయ్ తో సినిమాలు తెరకెక్కించి హ్యాట్రిక్ కొట్టాడు అట్లీ. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో జవాన్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

    ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా డైరెక్టర్ అట్లీ అభిమానులకు, ప్రేక్షకులకు గుడ్ న్యూస్ తెలియజేశాడు. ఆయన తండ్రి అయినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.

    మగ బిడ్డకు తండ్రిగా..

    డైరెక్టర్ అట్లీ 2014లో కృష్ణ ప్రియను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పట్లోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు పోస్ట్ పెట్టిన అట్లీ తాజాగా మగ బిడ్డకు తాను తండ్రి అయినట్లు చెప్పుకొచ్చాడు. దేవుడి ఆశీర్వచనంతో బేబీ బాయ్ వచ్చాడని.. తనకోసం తన భార్య ప్రియా అట్లీ అద్భుతమైన కానుకను అందించిదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అట్లీ.

    ఈ పోస్టో లో తన భార్యతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు ఈ తమిళ దర్శకుడు. ఇందులో రెండు బుజ్జి చెప్పులను చూపిస్తూ ఇట్స్ ఏ బాయ్ అని ఉంది. ప్రస్తుతం అట్లీ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శుభాకాంక్షలు అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

    English summary
    Shahrukh Khan Jawan Director Atlee Kumar And Priya Atlee Blessed With Baby Boy And Emotional Post Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X