దర్శకుడికి పుత్రోత్సాహం.. బిడ్డకు జన్మనిచ్చిన వీజే
జోకర్, జిప్సీ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న తమిళ దర్శకుడు రాజు మురుగన్ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. రాజు మురుగన్ భార్య, వీజే హేమ సిన్హా శుక్రవారం పండంటి బాబుకు జన్మినిచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని తెలిపారు.
వీజే హేమ, రాజు మురుగన్ కొద్దిరోజులపాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2016లో ఓ ప్రైవేట్ వేడుకగా సాగిన కార్యక్రమంలో వారిద్దరు పెళ్లి చేసుకొన్నారు.

ఇక రాజు మురుగన్ కెరీర్ విషయానికి వస్తే.. జర్నలిస్టుగా చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత కుకూ అనే చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత జోకర్, జిప్సీ లాంటి సినిమాలను రూపందించారు. జోకర్ చిత్రానికి 64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం రాజకీయ నేపథ్యంగా సాగే తమిళ చిత్రానికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో జీవా, నటాషా సింగ్ జంటగా నటిసున్నారు.


Click it and Unblock the Notifications











