ప్రమోషన్లకైతే రావు కానీ.. అవార్డులు కావాలా..? నయన్‌పై కోలీవుడ్ ఫైర్

దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్‌గా టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది నయనతార. అయితే సినిమా వరకు నయన్ వ్యవహారం బాగానే ఉన్నా.. తదనంతర వ్యవహారంలో నయన్ తీరు వేలెత్తి చూపేలా ఉంటోంది. సినిమాల్లో నటించడం ఓకే కానీ, ప్రమోషన్లకు రానని కండీషన్లు పెడుతుందనే సంగతి తెలిసిందే. సరే అదీ ఒకే అనుకున్నా తాజాగా ఓ వేడుకలో నయన్ పాల్గొనవడం చర్చనీయాంశంగా మారింది.

భారీ పారితోషికం..

భారీ పారితోషికం..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నయన్ నిలిచింది. సాధారణంగా అయితే ఓ సినిమాకు హీరోయిన్‌గా చేస్తే ఆరంభం నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆ తర్వాత కూడా సినిమా కోసం పని చేస్తూనే ఉంటారు. అంటే సినిమా విడుదల సమయంలో పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొనడం.. విడుదలైన తర్వాత కూడా సినిమాను ప్రమోట్ చేసేందుకు ఏవైనా కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ ఉంటారు. కానీ నయన్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది.

ప్రమోషన్స్‌కు నో..

ప్రమోషన్స్‌కు నో..

ఏ ఒక్క సినీ వేడుకలో పాల్గొనదు.. దీనికి సంబంధించి ముందే అగ్రిమెంట్ కూడా చేసుకుంటుందని టాక్. అప్పుడెప్పుడో శ్రీరామ రాజ్యం ఆడియో వేడుకలో పాల్గొన్న నయతార ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా కనిపించలేదు. సైరా చిత్రం కోసం ఈమెను తీసుకు వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి.

ఎవ్వరైనా సరే.. ఒకటే మాట..

ఎవ్వరైనా సరే.. ఒకటే మాట..

టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఎక్కడైనా.. అవతల ఎవరు ఉన్నా నయన్ మాట మాత్రం ఒకటే. మొన్నటి బిగిల్.. నేడు విడుదలైన దర్బార్ చిత్రాల ప్రమోషన్స్‌కు కూడా నయన్ రాలేదు. నయనతార ఈ విషయమై చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొనడం ఈమెకు ఇష్టం ఉండదు కనుక హాజరు కాదులే అని కొందరు అనుకుంటూ ఉంటారు.

జీ సినీ వేడుకల్లో..

జీ సినీ వేడుకల్లో..

అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన అవార్డు వేడుకలో పాల్గొనడంతో ఈమెపై కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులు అందుకునేందుకు వేడుకలకు వెళ్తావు.. కాని పబ్లిసిటీ కోసం మాత్రం ఎందుకు రావు అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి నయన్ ఈరకంగా ఆలోచిస్తుందో లేదో చూడాలి. సినిమాను నిలబెట్టేందుకు ప్రమోషన్స్‌లో పాల్గొంటే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా అభిప్రాయ పడుతుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X