ఏకంగా 223 ప్లాపులతో 1000 కోట్లు లాక్.. టాప్ ఇండస్ట్రీకి గట్టి దెబ్బ కొట్టిన సినిమాలివే..

వాస్తవానికి చెప్పుకోవాలి అంటే ఒకప్పుడు భారతీయ సినిమా దగ్గర ఓ రేంజ్ లో షైన్ అయ్యిన సినీ పరిశ్రమల్లో డెఫినెట్ గా హిందీ సినిమా ముందు ఉండేది. అయితే ఆ తర్వాత వారికీ ధీటుగా భారీ హంగులు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో తమిళ సినిమా దర్శకుడు శంకర్ పుణ్యమాని కొత్త అడుగులు చేసింది. అయితే అప్పట్లోనే లార్జర్ దన్ లైఫ్ సినిమాలు వీరు చేసేసారు. దీనితో ఆడియెన్స్ కి కావాల్సిన దానికంటే ఎక్కువే కొంచెం అడ్వాన్స్డ్ గా ట్రీట్ ఇచ్చారు.

కానీ అప్పుడు వాటి హవా నడిస్తే ఇపుడు ఇండియన్ సినిమా దగ్గరే కాకుండా వరల్డ్ సినిమా దగ్గర వాటిని దాటి తెలుగు సినిమా సత్తా చాటుతుంది. భారీ సినిమాలు వరల్డ్ క్లాస్ లెవెల్లో అందిస్తూ ఇండియాస్ నెంబర్ 1 ఇండస్ట్రీగా మన తెలుగు సినిమా నిలిచింది కానీ ఇపుడు అయితే మనలా తమిళ్ అండ్ హిందీ సినిమాలు మాత్రం పాన్ ఇండియా లెవెల్లో మంచి ఆదరణ అందుకోవడంలో చాలా స్ట్రగుల్ అవుతున్నాయి.

kollywood got 1000 crore lose with 223 flops in last year the are major dents

కాగా ఈ సినీ పరిశ్రమల్లో హిందీ సినిమా షారుఖ్ ఖాన్ సినిమాలు అలాగే పలు కొత్త ట్రెండ్ తో కూడిన సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నారు కానీ తమిళ సినీ పరిశ్రమ పరిస్థితి మాత్రం ఇపుడు మరింత దారుణంగా ఉంటుందట. కాగా ఒకప్పుడు సాలిడ్ కంటెంట్ తో భారీ సినిమాలు అందించిన తమిళ సినిమా ఏకంగా 1000 కోట్లు నష్టాలు చూడాల్సి వచ్చిందట.

కాగా నేషనల్ మీడియా కథనాల ప్రకారం గత ఏడాది 2024 లో తమిళ చిత్ర పరిశ్రమ ఏకంగా 223 ప్లాప్ సినిమాలు ఎదుర్కోవాల్సి వచ్చిందట. దీని ఫలితం అక్కడ ఏకంగా నిర్మాతలకి 1000 కోట్లకి పైగానే నష్టం వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కోలీవుడ్ లో ఈ రేంజ్ నష్టాలు ఈ మధ్య కాలంలో ఎపుడు రాలేదట. అత్యంత భారీ లెవెల్లో నష్టపోయియిన ఏడాదిలలో గత 2024 కూడా ఒకటి అని టాక్.

ఇలా గత ఏడాదిలో మలయాళ సినిమా కూడా ఘోరమైన నష్టాలే చూసినట్టుగా తెలిసింది. అయితే వీటికి కారణాలు భారీ ఎత్తున బడ్జెట్ లు పెట్టడమే కాకుండా హీరోలు కూడా భారీ ఎత్తున రెమ్యునరేషన్ లు డిమాండ్ చేస్తున్నారని అందుకే ఇంతటి నష్టాలు తమకి తప్పడం లేదని నిర్మాతలు వాపోతున్నారు. మరి తమిళ సినిమాలో గత ఏడాది కొన్ని భారీ బడ్జెట్ సినిమాల నిర్మాతలకి గాట్లు పెట్టాయి.

kollywood got 1000 crore lose with 223 flops in last year the are major dents

వాటిలో రజినీకాంత్ లాల్ సలాం, కమల్ హాసన్ ఇండియన్ 2, విక్రమ్ తంగళాన్ అలాగే సూర్య నటించిన కంగువా ఇంకా విజయ్ దళపతి నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ టైం లాంటి సినిమాలు హై ఎక్స్ పెక్టేషన్స్ నడుమ వచ్చి దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. మరి ఇవేమన్నా వర్క్ అయ్యి ఉండుంటే తమిళ సినిమా ఈ రేంజ్ నష్టాలు చూసి ఉండకపోవచ్చని చెప్పవచ్చు. మరి ఈ ఏడాది కోలీవుడ్ కి ఎలా ఉంటుందో చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: kollywood bollywood tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X