బైక్ పై పది వేల కిలోమీటర్ల ప్రయాణం.. రియల్ లైఫ్ లో స్టార్ హీరో సంచలన రికార్డ్
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా తల అజిత్ కు ఉండే క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ బుగా ఉంటుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్స్ తరువాత అత్యదిక అభిమానులు కలిగి ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. ఈ స్టార్ హీరో కమర్షియల్ సినిమాలతో ఎక్కువగా తన మార్కెట్ ను పెంచుకున్నాడు. అజిత్ కు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఉన్నాయి. ఇటీవల బైక్ నడుపుకుంటు ఏకంగా వేల కిలోమీటర్లు దాటేశాడు.

బాక్సాఫీస్ వద్ద వరుసగా 5సార్లు..
తమిళ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ను పవర్ఫుల్ గా సెట్ చేసుకుంటున్న అజిత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వంద కోట్లకు తక్కువ రాబట్టవు. గత 5 సినిమాలు కూడా వరుసగా వంద కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకొని న్యూ రికార్డు క్రియేట్ చేశాయి. వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండే అజిత్ అభిమానులకు కూడా దూరంగానే ఉంటాడు.
బ్యూటీ హీనా పంచల్ ఎద అందాల ఆరబోత.. హాట్ హాట్‌గా ఫోటోషూట్

బైక్స్ అంటే ప్రాణం..
పర్సనల్ లైఫ్ తో ఫ్యామిలీతో అజిత్ చాలా బిజీగా ఉంటాడు. లేకుంటే బైక్స్ తో ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటాడు. హీరోకు బైక్స్ అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు షూటింగ్స్ కు బైక్ పైన కూడా వస్తుంటాడు. లొకేషన్స్ వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా కూడా లెక్క చేయడు. ఒకసారైతే హైదరాబాద్ లో షూటింగ్ కోసం వచ్చి సినిమాలో వాడిన బైక్ పైనే చెన్నైకు వెళ్లిపోయాడు. అజిత్ కు బైక్ నచ్చింది అంటే అస్సలు వదిలిపెట్టడు.

ఏకంగాక్ పదివేల కిలోమీటర్ల ప్రయాణం
ఇక చాలా రోజుల తరవాత అజిత్ ఒక లాంగ్ టూర్ వేశాడు. బైక్ రేసులో పాల్గొన్న అనుభవం కూడా ఉన్న అజిత్ చాలా జాగ్రత్తగా ప్రయాణం చేస్తుంటారు. అయితే రీసెంట్ గా తన బీఎండబ్ల్యూ బైక్ పై పదివేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడు. తన బైక్ పాట్నర్ ఒకరు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
Recommended Video

స్టార్ హీరో న్యూ రికార్డ్
చెన్నై నుంచి కోయంబత్తూర్ హైదరాబాద్, వారణాసి. గంగ్ టాక్, లక్నో జ్ అయోధ్య వంటి ప్రాంతాలను తీరిక లేకుండా చుట్టేసిన అజిత్ మొత్తం పది వేల కిలో మీటర్ల ప్రయాణాన్ని ఫినిష్ చేశాడట. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి రికార్డును క్రియేట్ చేయలేదు. అజిత్ తో పాటు బైక్ రైడింగ్ ఇష్టమైన మరో ఇద్దరు ముగ్గురు కూడా ఆయనతో కలిసి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజుల్లో అజిత్ ఇంకా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











